10-01-2021- ఆదివారం మీ రాశి ఫలితాలు.. ఆదిత్య హృదయం చదివినా..?

Sun God
Sun God
రామన్|
ఆదిత్య హృదయం చదివినా లేక విన్నా శుభం జయం చేకూరుతుంది.

మేషం: చేపట్టిన పనులు మొక్కుబడిగా పూర్త చేస్తారు. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, ఒప్పందాలు వాయిదా వేయడం శ్రేయస్కరం. కుటుంబ సౌఖ్యం, వాహన యోగం, వస్తు ప్రాప్తి వంటి శుభ ఫలితాలుంటాయి. బంధుమిత్రులు మీ పరిస్థితులను అర్థం చేసుకుంటారు. రాబడికి మించిన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి.

వృషభం: మీ కార్యక్రమాలు, ప్రయాణాలు ప్రణాళికాబద్ధంగా సాగుతాయి. నూతన పెట్టుబడులు, సంస్థలు, పరిశ్రమల స్థాపనకు అనుకూలం. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. ఉపాధ్యాయులు సభలు, సమావేశాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. ఒకానొక విషయంలో మీ సన్నిహితీరు నిరుత్సాహపరుస్తుంది.

మిథునం: రాజకీయ నాయకులు తమ ఆలోచనలు, పథకాలు గోప్యంగా వుంచడం మంచిది. స్త్రీలకు పనివారలతో చికాకులు తప్పవు. రిప్రజెంటేటివ్‌లు తమ టార్గెట్లను సునాయాసంగా అధికమిస్తారు. భాగస్వామిక చర్చలు అర్థాంతరంగా ముగుస్తాయి. ప్రేమికులకు ఎడబాటు తప్పదు. ఒక శుభకార్యం చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది.

కర్కాటకం: డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు. శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. కొత్తగా చేపట్టిన వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి. లీజు, ఏజెన్సీలు, నూతన టెండర్ల విషయంలో పునరాలోచన అవసరం. సన్నిహితులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు.

సింహం: ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. ఉపాధ్యాయుసు విశ్రాంతి పొందుతారు. స్టాక్ మార్కెట్ రంగాల వారి అంచనాలు నిరుత్సాహపరుస్తాయి. వస్త్ర, బంగారం, గృహోపకరణ వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టడం మంచిది.

కన్య: స్త్రీల ప్రతిభాపాటవాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రేమికులు అతిగా వ్యవహరించి ఇబ్బందులకు గురవుతారు. కొబ్బరి, పూలు, పండ్లు, చిరు వ్యాపారులకు లాభదాయకం. నిరుద్యోగుల ఆలోచనలు ఉపాధి పథకాల దిశగా సాగుతాయి. బంధు మిత్రుల కారణంగా మీ కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు.

తుల: స్త్రీల ఆరోగ్యం కుదుట పడుతుంది. విద్యార్థులకు ఒత్తిడి పెరుగుతుంది. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు నిర్మాణ పనుల్లో ఏకాగ్రత అవసరం. ఉన్నతస్థాయి అధికారులు ప్రలోభాలకు దూరంగా వుండటం క్షేమదాయకం. భాగస్వామిక, సొంత వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. నూతన వ్యక్తులతో మితంగా సంభాషించండి.

వృశ్చికం: మీ సంతానం మొండివైఖరి, కళత్ర మాటతీరు చికాకు పరుస్తాయి. గృహ నిర్మాణాలు, మరమ్మతులు సంతృప్తికరంగా సాగుతాయి. వ్యాపారాల్లో పెరిగిన పోటీతత్వం నిరుత్సాహపరుస్తుంది. ఊహించని ఖర్చులు, పెరిగిన ధరలు ఆందోళన కలిగిస్తాయి. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు, శుభాకాంక్షలు అందుకుంటారు.

ధనస్సు: ఒక వ్యవహారం నిమిత్తం న్యాయవాదులను సంప్రదిస్తారు. చేతివృత్తుల వారికి ఆశాజనకం. దూర ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా వుంటుంది. కుటుంబీకులతో కలిసి ఆలయాలను సందర్శిస్తారు. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది.

మకరం: వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ, గృహోపకరణ వ్యాపారులకు కలిసిరాగలదు. పాత మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. మీ వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. వృత్తులు, చికు వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. స్పెక్యులేషన్ రంగాల వారు నష్టాలను చవిచూడాల్సి వస్తుంది.

కుంభం: హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. దైవ సేవా కార్యక్రమాలను దాన ధర్మాలు చేయడం వల్ల మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు.

మీనం: విలువైన వస్తువులు, పత్రాలు చేజారిపోయే ఆస్కారం వుంది. మెలకువ వహించండి. మీ సంతానం కోసం బాగా శ్రమిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికాగలవు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. రాబడికి మించి ఖర్చులెదురైనా ఇబ్బందులుండవు. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది.దీనిపై మరింత చదవండి :