మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

07-01-2021 గురువారం దినఫలాలు - సాయిబాబాను ఆరాధించినా...

మేషం : భాగస్వామిక చర్చల్లో కొత్త విషయాలు చోటుచేసుకుంటాయి. మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి అధికం. వృత్తుల వారికి మిశ్రమ ఫలితం. ఉద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత ముఖ్యం. విద్యార్థులు క్యాంపస్ సెలక్షన్లకు ఎంపిక అవుతారు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. క్రయ విక్రయాలు జోరుగాసాగుతాయి.
 
వృషభం : స్త్రీలకు బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వస్త్ర, ఫ్యాన్సీ, పచారీ, చిరు వ్యాపారులకు అన్ని విధాలా కలిసిరాగలదు. ఒక స్థిరాస్తి అమ్మకం లేదా కొనుగోలు దిశగా మీ ఆలోచనలు ఉంటాయి. విద్యార్థులు అత్యుత్సాహం అనర్థాలకు దారితీసే ఆస్కారం ఉంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం వంటి చికాకులు ఉంటాయి.
 
మిథునం : ఏజెంట్లు, బ్రోకర్లుకు శ్రమాధిక్యత మినహా ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్లు, ఫ్లీడరు గుమస్తాలకు ఒత్తిడి అధికంగా ఉంటుంది. స్త్రీలకు షాపింగ్‌లోనూ, వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం. స్టాక్ మార్కెట్ రంగాల వారి అంచనాలు నిరుత్సాహపరుస్తాయి. 
 
కర్కాటకం : వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. సేల్స్ సిబ్బందికి ధన, వస్తు ప్రతిఫలం అందిస్తారు. స్త్రీల భావాలకు, కళాత్మతకు మంచి గుర్తింపు లభిస్తుమంది. బ్యాంకు వ్యవహారాలలో మెళకువ అవసరం. ప్రేమికుల వ్యవహారం వివాదాస్పదమవుతుంది. మీ జీవిత భాగస్వామి విషయంలో దాపరికం మంచిదికాదు. 
 
సింహం : ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికమవుతాయి. పత్రికా, ప్రైవేటు సంస్థలలోని వారిక యాజమాన్యం ధోరణి నిరుత్సాహం కలిగిస్తుంది. వాహనం ఇతరులకు ఇవ్వడం వల్ల సమస్యలు తలెత్తుతాయి. లౌక్యంగా వ్యవహరించి ఒక అవకాశాన్ని మీకు అనుకూలంగా మలుచుకుంటారు. నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి. 
 
కన్య : వైద్య రంగంలోని వారు అరుదైన ఆపరేషన్లను సమర్థంగా నిర్వహిస్తారు. స్త్రీలకు షాపింగ్‌లోనూ, వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం. సన్నిహితుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. రావలసిన ధనం వసూలులో శ్రమ, ప్రయాసలెదుర్కొంటారు. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది.
 
తుల : గృహ మరమ్మతులు, మార్పులు, చేర్పులు చేపడతారు. పత్రికా సంస్థలలోని ఉద్యోగస్తులకు తోటివారి ధోరణి నిరుత్సాహం కలిగిస్తుంది. దూర ప్రయాణాలలో కొంత అసౌకర్యానికి లోనవుతారు. క్రయ, విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. లీజు, ఏజెన్సీలు, నూతన పెట్టుబడులకు ఇది సమయం కాదని గమనించండి.
 
వృశ్చికం : ఆర్థిక, లావాదేవీలు, కీలకమైన వ్యవహారాలు సమర్థంగా పరిష్కరిస్తారు. ఉద్యోగస్తులకు పండుగ అడ్వాన్సులు మంజూరవుతాయి. కాంట్రాక్టర్లకు నిర్మాణ పనుల్లో నాణ్యత లోపం వల్ల ఇబ్బందులు తప్పవు. స్త్రీల ఆరోగ్యం కుదుటపడుతుంది. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది.
 
ధనస్సు : స్త్రీలకు స్వీయ సంపాదన పట్ల ఆసక్తి, అందుకు అవసరమైన పరిస్థితులు నెలకొంటాయి. పత్రికా సంస్థలోని వారికి ఒత్తిడి పనిభారం అధికంగా ఉంటుంది. రుణయత్నాల్లో ఆటంకాలు తొలగిపోగలవు. ఉద్యోగరీత్యా ఆకస్మికంగా ప్రయాణాలు చేయవలసివస్తుంది. ఎదుటివారితో వాగ్వివాదాలు, పంతాలకు పోవడం మంచిదికాదు.
 
మకరం : భాగస్వామిక చర్చలు సంప్రదింపులు ప్రశాంతంగా ముగుస్తాయి. మీ సంతానం కోసం ధనం బాగా వెచ్చిస్తారు. మీ అభిప్రాయాలు, ఆలోచనలు గోప్యంగా ఉంచడం మంచిది. తలపెట్టిన పనులు అర్థాంతరంగా ముగిస్తారు. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి అధికమవుతుంది. కోర్టు వ్యవహారాలు వాయిదాపడటం మంచిది. 
 
కుంభం : నిర్మాణ పనులలో కాంట్రాక్టర్లు, బిల్డర్లకు చికాకులు తప్వు. ప్రయాణ ఉద్దేశ్యం నెరవేరుతుంది. వాణిజ్య ఒప్పందాలు, రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. వృత్తుల వారికి అన్ని విధాలా కలిసిరాగలదు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటంతో నిరుత్సాహం తప్పదు. ఆత్మీయుల కలయిక సంతోషం కలిగిస్తుంది. 
 
మీనం : విద్యార్థులు అతిగా వ్యవహరించడం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. ఉపాధ్యాయులకు ఒత్తిడి, శ్రమ అధికం. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. ప్రింటింగ్ రంగాల్లో వారికి బాకీల వసూళ్లలో శ్రమ, ప్రయాసలెదుర్కోవలసి వస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలేఖలు అందుతాయి.