సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

13-01-2021 బుధవారం దినఫలాలు - మహావిష్ణువును ఆరాధించినా...

మేషం : మీ జీవిత భాగస్వామి విషయంలో దాపరికం మంచిదికాదు. మిత్రులను కలుసుకుంటారు. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. ముఖ్యంగా మీ స్థాయికి మించి ఖర్చులు చేయకండి. సొంత వ్యాపారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ ఆలోచనలు, పథకాలు గోప్యంగా ఉంచడం శ్రేయస్కరం. 
 
వృషభం : డబ్బు చేతికందకపోవడంతో కొన్ని పనులు ఆలస్యంగా పూర్తిచేస్తారు. ఉద్యోగులు కొత్త బాధ్యతలు చేపడతారు. పాత మిత్రులను కలుసుకుంటారు. కడుపు నొప్పలాంటి సమస్యలకు వెంటనే వైద్యం చేయించుకోండి. వృత్తి వ్యాపారాల్లో పోటీతత్వం మిమ్మలను ఆందోళనకు గురిచేస్తుంది. ఆలయాలను సందర్శిస్తారు. 
 
మిథునం : మీ సంతానం ఆరోగ్యం, విద్యా విషయాల పట్ల శ్రద్ధ కనపరుస్తారు. స్త్రీలకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది. విద్యార్థులు ఆలోచనలు పక్కదారిపట్టే ఆస్కారం ఉంది. ప్రేమికుల తొందరపాటు నిర్ణయాలు ఇబ్బందులకు గురిచేస్తాయి. రాజకీయ నాయకులకు సంఘంలో మంచి గుర్తింపు, రాణిపు లభిస్తుంది. 
 
కర్కాటకం : ఖర్చులు రాబడికి తగినట్టుగానే ఉంటాయి. ఎదుటివారి తీరును గమనించి మెలగండి. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. భాగస్వామికుల మధ్య విభేదాలు, పట్టింపులు తలెత్తే ఆస్కారం ఉంది. వ్యాపారాల వర్గాల వారిక చెక్కుల జారీలో ఏకాగ్రత ముఖ్యం. మీ అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకు సమయం కలిసివస్తుంది. 
 
సింహం : ప్రస్తుత సమయం కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. ఆనందం విచారకరమైన అనుభవాలు ఎదురవుతాయి. స్త్రీలకు బంధు వర్గాలతో సఖ్యత నెలకొంటుంది. కుటుంబ సౌఖ్యం, వాహనయోగం పొందుతారు. దైవ దీక్షల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయంగా ఉంటుంది. 
 
కన్య : ఆర్థిక, కుటుంబ, వ్యాపార వ్యవహారాల పట్ల ఏకాగ్రత ముఖ్యం. స్త్రీలకు ఆభరణాలు, విలువైన వస్తువుల పట్ల ఆసక్తి నెలకొంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు, సంప్రదింపులతో క్షణం తీరిక ఉండదు. కొత్త పనివారలతో చికాకులను ఎదుర్కొంటారు. అర్థాంతరంగా నిలిపివేసిన గృహ మరమ్మతులు, పనులు పునఃప్రారంభిస్తారు. 
 
తుల : ఏవైనా చిన్న చిన్న సమస్యలు తలెత్తినా తాత్కాలికమేనని గ్రహించండి. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. ఆలయాలను సందర్శిస్తారు. ఐరన్, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల్లో వారికి లాభదాయకం. అనుకున్న పనులలో ఆటంకాలు ఎదురైనా మొండి ధైర్యంతో ముందుకుసాగి పూర్తిచేస్తారు. 
 
వృశ్చికం : ఉద్యోగస్తులు అధికారుల నుంచి మెప్పు పొందుతారు. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాలలో వారికి అనుకూలం. పాత వస్తువులను కొని సమస్యలు తెచ్చుకోకండి. విద్యార్థినులకు కొత్త పరిచయాలు, వాతావరణం సంతృప్తినిస్తాయి. వృత్తుల వారికి శ్రమించిన కొలదీ ఆదాయం. స్త్రీలతో మితంగా సంభాషించడం అన్ని విధాలా మంచిది. 
 
ధనస్సు : ఆర్థిక లావాదేవీల్లో ఒడిదుడుకులు ఎదురైనా అధికమిస్తారు. స్త్రీల ఏమరుపాటుతనం వల్ల విలువైన వస్తువులు చేజార్చుకునే అవకాశం ఉంది. రాత పరీక్షల యందు మీరు గణనీయమైన విజయాన్ని సాధిస్తారు. సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఉద్యోగాలకు టార్గెట్ పూర్తి చేయడం కష్టతరమవుతుంది. 
 
మకరం :  మీకు దగ్గరగా ఉన్న మీకే తెలియని ఒక అవకాశం మిమ్మల్ని వరిస్తుంది. ఒక ఖర్చు నిమిత్తం తెచ్చిన ధనం మరొక అవసరానికి వినియోగిస్తారు. పాత మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. నూనె, ఎండుమిర్చి, బెల్లం, చింతపండు, వ్యాపారస్తులకు కలిసివచ్చే కాలం. రవాణా రంగాల వారికి సంతృప్తి పురోభివృద్ధి. 
 
కుంభం : హోటల్, క్యాటరింగ్ పనివారలకు కలిసిరాగలదు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు వచ్చినప్పటికి వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతారు. విద్యార్థులు అనవసర విషయాలకు దూరంగా ఉండటం మంచిది. కుటుంబ విషయాలలో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. ఎంత కష్టమైన పనైనా అవలీలగా పూర్తిచేస్తారు. 
 
మీనం : సంఘంలో మీ ఉన్నతికి, పరపతికి గౌరవం, గుర్తింపు లభిస్తాయి. స్త్రీలు ఆడంబరాలకు పోయి సమస్యలు తెచ్చుకోకండి. బ్యాంకు వ్యవహారాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. రాజకీయ కళా రంగాల వారికి విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. వస్త్ర, బంగారం, వెండి, ఫ్యాన్సీ వ్యాపారులకు ఒత్తిడి పెరుగుతుంది.