1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

05-05-2023 శుక్రవారం రాశిఫలాలు - అమ్మవారిని ఎర్రని మందారాలతో పూజించి...

Aquarius
మేషం :- నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. బంధువుల రాకతో గృహంలో సందడికానవస్తుంది. చెక్కుల జారీ, ఖాతాదారులు, పనివారలతో జాగ్రత్తగా ఉండాలి. పొగడ్తలు, మొహమ్మాటాలకు లొంగిపోవద్దు. ఉద్యోగస్తులు సమర్ధతను అధికారులు గుర్తిస్తారు. వ్యాపారాభివృద్ధికి పలు ప్రణాళికలు, పథకాలు అమలు చేస్తారు.
 
వృషభం :- స్త్రీలకు తమ మాటే నెగ్గాలన్న పట్టుదల అధికమవుతుంది. వాగ్వివాదాలకు దిగి సమస్యలు కొనితెచ్చుకోకండి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. రాజకీయనాయకులకు ప్రయాణాలలో మెళుకువ అవసరం. మీ హోదాకు, అభిరుచులకు తగిన వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలు బలపడతాయి.
 
మిథునం :- ఆర్థికలావాదేవీలు, కీలకమైన సమస్యలు సమర్థవంతంగా పరిష్కరిస్తారు. ఎదుటివారి తీరును గమనించి దానికి తగినట్లుగా మెలగండి. శాస్త్ర, సాంకేతిక, కళ, క్రీడా రంగాల వారికి ఆశాజనకం. మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి, త్రిప్పట తప్పవు. మీ పట్టుదల, అంకితభావం ఇతరులకు మార్గదర్శకమవుతుంది.
 
కర్కాటకం :- పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి నిరుత్సాహం తప్పదు. శారీరకశ్రమ, మానసికఒత్తిడి వల్ల అస్వస్థతకు గురవుతారు. సంఘంలో మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. మిత్రుల కలయికతో గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు.
 
సింహం :- ఉద్యోగ, వ్యాపారులకు అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. మనుషుల మనస్తత్వం తెలిసి మసలుకొనుట మంచిది. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. విద్యార్థినులు ప్రేమ వ్యవహరాల్లో అతిగా వ్యవహరించటం వల్ల భంగపాటు తప్పదు. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
 
కన్య :- స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలవారికి పురోభివృద్ధి. ప్రేమికులకు నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. సొంతంగా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన కొంత కాలం వాయిదా వేయటం శ్రేయస్కరం. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. స్త్రీలు ఓర్పు, పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు.
 
తుల :- బేకరి, స్వీట్స్, తినుబండారాల వ్యాపారులకు, తయారీదారులకు ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణ లక్ష్యం నెరవేరుతుంది. ఉద్యోగస్తులు చాకచక్యంగా వ్యవహరించి ఒక సమస్య నుంచి క్షేమంగా బయటపడతారు. సోదరుల మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
వృశ్చికం :- రాబడికి మించిన ఖర్చులు, చెల్లింపుల వల్ల ఆటుపోట్లు ఎదుర్కొంటారు. గతంలో వాయిదా వేసిన పనులు పునఃప్రారంభిస్తారు. ఇంటికి అవసరమైన వస్తుసామగ్రి సమకూర్చుకుంటారు. స్త్రీలు ఒత్తిళ్ళు, మొహమ్మాటాలకు పోవడం వల్ల సమస్యలు తప్పవు. వాహనచోదకులకు ఊహించని ఆటంకాలు ఎదురవుతాయి.
 
ధనస్సు :- రచయితలకు, పత్రికా రంగంలో వారికి ప్రోత్సాహకరం. బ్యాంకింగ్, ఫైనాన్సు రంగాల వారికి ఒత్తిడి, చికాకులు త్రిప్పట తప్పవు. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. సోదరీ, సజ్జన సాంగత్యం, సభలు, సమావేశాల్లో గౌరవం పొందుతారు. కుటుంబీకులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు.
 
మకరం :- ప్రియతముల రాక, చిన్ననాటి వ్యక్తుల కలయిక సంతోషం కలిగిస్తుంది. పారిశ్రామిక రంగంలోని వారికి కార్మిక, విద్యుత్ వంటి సమస్యలు తప్పవు. అధిక ఉష్ణం వల్ల ఆరోగ్యం దెబ్బ తింటుంది. ఆదాయ వ్యయాలు మీ బడ్జెటు భిన్నంగా ఉంటాయి. వృత్తిపరమైన ప్రయాణాలు, సరకుల రవాణాలో సమస్యలు తలెత్తుతాయి.
 
కుంభం :- రుణ బాధలు, ఒత్తిడులు, మానసిక ఆందోళన ఉంటాయి. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. స్త్రీలకు టీ.వీ కార్యక్రమాల్లో నూతన అవకాశాలు లభిస్తాయి. కపటంలేని మీ ఆలోచనలు, సలహాలు మీకు అభిమానుల్ని సంపాదించి పెడుతుంది.
 
మీనం :- విద్యార్థులకు క్రీడలపట్ల ఆసక్తి పెరుగుతుంది. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. దంపతుల మధ్య అకారణ కలహం, పట్టింపులు అధికమవుతాయి. బాకీలు, ఇంటి అద్దెలు, ఇతరత్రా రావలసిన బకాయిలను లౌక్యంగా వసులు చేసుకోవాలి. ఊహించని విధంగా ధనలాభం పొందుతారు.