గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

03-05-2023 బుధవారం రాశిఫలాలు - లలిత సహస్రనామం చదివినా లేక విన్నా శుభం...

Scorpio
మేషం :- స్త్రీల ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు పనివారలతో చికాకులు, అధికారుల ఒత్తిడి అధికం. ఎంతటి క్లిష్టపరిస్థితులనైనా నిబ్బరంగా ఎదుర్కుంటారు. కార్యసాధనలో ఓర్పు, నేర్పు, పట్టుదల అవసరం.
 
వృషభం :- తొందరపాటుతనం వల్ల ప్రేమికులు చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. దైవకార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. బేకరి, స్వీట్స్, తినుబండారాల వ్యాపారులకు కలిసివస్తుంది. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించండి. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది.
 
మిథునం :- నిరుత్సాహం వీడి ఉద్యోగయత్నాలు సాగించండి. అధికారులకు మీ సమర్థతపై నమ్మకం తగ్గుతుంది. భాగస్వామిక సమావేశాల్లో కొత్త అంశాలు చర్చకు వస్తాయి. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు, చికాకులు ఎదుర్కుంటారు. పెద్దమొత్తం నగదుతో ప్రయాణం క్షేమం కాదు. క్యాటరింగ్, ట్రావెలింగ్ రంగాల వారికిపురోభివృద్ధి. 
 
కర్కాటకం :- కార్యసాధనలో ఓర్పు, నేర్పు, పట్టుదల అవసరం. ఆకస్మిక ప్రయాణాలు చేయవలసివస్తుంది. గృహంలో మార్పులు, చేర్పులకు అనుకూలిస్తాయి. సంఘంలో ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయం మీ ఉన్నతికి సహకరిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. దైవ దర్శనాలవల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.
 
సింహం :- పత్రికా సిబ్బందికి చికాకులు అధికమవుతాయి. ఉద్యోగస్తుల దైనందిన కార్యకలాపాలు యధావిధిగా సాగుతాయి. ఓర్పు, మంచితనంతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. భార్య, భర్తల మధ్య మనస్పర్ధలు సమసిపోతాయి. వ్యాపార రంగాలవారికి అధికారుల తనిఖీలు, పనివారల నిర్లక్ష్యం ఆందోళన కలిగిస్తాయి.
 
కన్య :- గృహోపకరణాలను అమర్చుకోవటంలో మునిగిపోతారు. స్త్రీలు షాపింగులకు ధనం బాగా ఖర్చు చేస్తారు. సంఘంలో మీకు పేరు, ప్రఖ్యాతులు పెరుగును. సాహిత్యవేత్తలకు ప్రత్యేక గుర్తింపు లభించును. భార్యా, బిడ్డలతో స్వల్పంగా మనస్ఫర్థలు తలెత్తగలవు. వైద్యులకు శస్త్రచికిత్స చేయునపుడు ఏకాగ్రత అవసరం.
 
తుల :- శత్రువులు మిత్రులుగా మారతారు. గృహిణులకు పనివాలతో సమస్యలు తలెత్తుతాయి. బంధు మిత్రులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. సాహస ప్రయత్నాలు విరమించండి. బ్యాంకు పనుల్లో స్వల్ప ఆటంకాలను ఎదుర్కుంటారు. కిరాణా, ఫ్యాన్సీ, నిత్యవసర వస్తు వ్యాపారులకు, స్టాకిస్టులకు కలిసిరాగలదు.
 
వృశ్చికం :- చిట్స్, ఫైనాన్సు రంగాల్లో వారికి ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు మార్పులకై చేయు ప్రయత్నాలు అనుకూలించవు. స్థిర బుద్ధి లేకపోవడం వల్ల ఇబ్బందులను ఎదుర్కుంటారు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. సోదరీ, సోదరుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు.
 
ధనస్సు :- వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఒక సమాచారం బాగా ఆలోచింపచేస్తుంది. విదేశీయానం నిమిత్తం చేసే యత్నాలు ఒకకొలిక్కి వస్తాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలలో వారికి పనివారితో సమస్యలు తెలుత్తుతాయి. 
 
మకరం :- ముఖ్యుల గురించి ఆందోళన చెందుతారు. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. కపటంలేని మీ ఆలోచనలు, సలహాలు మీకు అభిమానులను సంపాదించి పెడుతుంది. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదా పడతతాయి. ఆడిట్, అక్కౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికంగాఉంటాయి.
 
కుంభం :- మీ మంచి కోరుకొనేవారు కంటే మీ చెడును కోరేవారే ఎక్కువగా ఉన్నారు. ఎదుటివారితో మితంగా సంభాషించటం మంచిది. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. బ్యాంకుల నుంచి పెద్దమొత్తం నగదు డ్రా చేసే విషయంలో జాగ్రత్త వహించండి.
 
మీనం :- రాజకీయాల్లో వారికి ఆందోళన తప్పదు. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. మీ సంతానం విజయం సంతోషం కలిగిస్తుంది. మీ కుటుంబానికి మీరు అవసరం కనుక వ్యసనాలకు దూరంగా ఉండండి. ప్రింటింగ్, స్టేషనరీ రంగంలో వారు అచ్చు తప్పులు పడుటవలన మాట పడవలసివస్తుంది.