1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

22-06-2023 గురువారం రాశిఫలాలు - దత్తాత్రేయుడని ఆరాధించి మీ సంకల్పం...

Libra
మేషం :- శారీరక శ్రమ అధికమవుతుంది. భార్య, భర్తల మధ్య మనస్పర్ధలు తలెత్తిన తెలివితో పరిష్కరిస్తారు. ఫ్యాన్సీ, స్టేషనరీ, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు శుభదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తుల సమర్ధత, చాకచక్యానికి అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. కాంట్రాక్టర్లకు నూతన టెండర్లు అనుకూలించవు.
 
వృషభం :- వ్యాపారస్తులకు శ్రమకు తగిన ప్రతిఫలం కానవస్తుంది. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభిస్తారు. పెరుగుతున్న ఖర్చులు, ఇతరత్రా అవసరాలు మీ ఆర్థికస్థితికి అవరోధంగా నిలుస్తాయి. మార్కెటింగ్, ప్రింటింగ్ రంగాలవారికి ఆశాజనకం. ఇతరులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
మిథునం :- చేపట్టిన పనులు సంతృప్తికరంగా పూర్తి కాగలవు. మిత్రులు, బంధువుల తోడ్పాటుతో ముందుకు సాగుతారు. బంధువుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలల్లో వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తారు. 
 
కర్కాటకం :- కుటుంబ సమస్యల నుండి బయటపడతారు. ఆలయాలను సందర్శిస్తారు. విద్యార్థులకు పాఠ్యాంశాల పట్ల ఆసక్తి సన్నగిల్లుతుంది. నూతన పరిశ్రమలు, వ్యాపార విస్తరణలు అనుకూలిస్తాయి. వృత్తులు, చిన్నతరహా పరిశ్రమల వారికి ఆశాజనకంగా ఉంటుంది. ఆకస్మిక ఖర్చుల వల్ల ఒకింత ఒడిదుడుకులు తప్పవు.
 
సింహం :- ఆర్థిక లావాదేవీలు సమర్థంగా నిర్వహిస్తారు. విద్యార్థులకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం. పెద్దలు, పిల్లల ఆరోగ్యంలో స్వల్ప చికాకులుంటాయి. స్త్రీల మనోవాంఛలు నెరవేరటంతో కొత్త అనుభూతికి లోనవుతారు. వీసా, పాస్ పోర్టులకు సంబంధించిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కుంటారు.
 
కన్య :- కొబ్బరి, పండ్ల, పూల చిరు వ్యాపారులకు పురోభివృద్ధి. అనుకున్న కార్యాలు మధ్యలోనిలిచిపోవును. చెల్లింపులు, షాపింగ్ వ్యవహారాల్లో మెళకువ వహించండి. అనవసపు వివాదాల్లో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. ఉద్యోగ ప్రయత్నం అనుకూలించడంతో మీలో నూతన ఉత్సాహం చోటు చేసుకుంటుంది.
 
తుల :- స్త్రీలు వస్త్రములు, ఆభరణములు వంటి వస్తువులు కొనుగోలు చేస్తారు. తరచూ సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. దైవ చింతన పెరుగుతుంది. దూర ప్రయాణాలకై చేయుప్రయత్నాలు వాయిదాపడును. ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి తప్పదు. మిత్రుల తీరు నిరుత్సాహ పరుస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ అనుకూలిస్తాయి.
 
వృశ్చికం :- ఆర్థిక వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా అధికమిస్తారు. విద్యుత్ వస్తువుల పట్ల ఏకాగ్రత చూపుతారు. కాంట్రాక్టర్లు ప్రముఖుల సహకారంతో పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారు. మీ కళత్ర మొండి వైఖరి వల్ల కుటుంబ సౌఖ్యం లోపిస్తుంది. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి శ్రమించిన ఫలితాలొస్తాయి.
 
ధనస్సు :- లిటిగేషన్ వ్యవహారాలు వాయిదా పడుటమంచిది. స్త్రీల ఉద్యోగ యత్నం ఫలిస్తుంది. వ్యాపారాల్లో పోటీని ధీటుగా ఎదుర్కుంటారు. మార్కెట్ రంగాల వారికి నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి. ఇచ్చిపుచ్చుకునే వ్యవహరాలు, ఒప్పందాల్లో మెళకువ వహించండి. దైవదర్శనాలకై చేయు యత్నాలు ఫలిస్తాయి.
 
మకరం :- గృహానికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు. మీ సృజనాత్మక శక్తికి, తెలివితేటలకు గుర్తింపు లభిస్తుంది. కీలకమైన వ్యవహారాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. రాజకీయ రంగాల వారికి విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. ఏసీ, కూలర్ మెకానిక్ రంగాలలో వారిక సంతృప్తి కానవస్తుంది.
 
కుంభం :- బ్యాంకింగ్ రంగాల వారు ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. బంధువుల మద్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. మీ కార్యక్రమాలు, పనులు వాయిదా వేసుకోవలసి వస్తుంది. కళలు, క్రీడల పట్ల ఆసక్తి పెంచుకుంటారు. భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు మిశ్రమ స్పందన ఎదురవుతుంది.
 
మీనం :- ఆర్థిక విషయాల్లో అనుకోని ఇబ్బందులు ఎదురయ్యే సూచనలున్నాయి. ఉద్యోగస్తులకు శ్రమకు, నైపుణ్యతకు మంచి గుర్తింపు లభిస్తుంది. స్త్రీలకు షాపింగ్ విషయాలలోను, వాహనం నడుపుతున్నపుడు జాగ్రత్త అవసరం. రాజకీయ రంగాలవారికి విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. ఖర్చులు బాగా పెరిగే అస్కారం ఉంది.