బుధవారం, 1 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

18-06-2023 ఆదివారం రాశిఫలాలు - సూర్య స్తుతి ఆరాధించిన శుభం కలుగుతుంది...

Weekly Horoscope
మేషం :- పండ్లు, పూలు, కొబ్బరి, చల్లని పానీయ, చిరు వ్యాపారులకు కలిసివస్తుంది. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. భాగస్వామిక చర్చలు ప్రశాంతంగా ముగుస్తాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. బంధు మిత్రుల రాకపోకలు అధికమవుతాయి.
 
వృషభం :- స్త్రీలకు అకాల భోజనం వలన ఆర్యోగంలో చికాకులు తప్పవు. ముఖ్యుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు. రావలసిన బాకాయిలు వాయిదా పడతాయి. విద్యుత్, ఏసీ, కూలర్లు, మెకానికల్ రంగాలలో వారికి పురోభివృద్ధి, సంతృప్తి కానవస్తుంది. సమయానుకూలంగా మీరు తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలిస్తాయి. 
 
మిథునం :- వాహనచోదకులు, యాజమానులు అప్రమత్తంగా ఉండాలి. క్రీడారంగాల్లో వారికి ఒత్తిడి పెరుగుతుంది. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు ఇబ్బందులు వంటివి తలెత్తుతాయి. చేసే పనిలో ఏకాగ్రత లోపం వల్ల చికాకులు ఎదుర్కుంటారు. ఆకస్మికంగా ఆరోగ్యంలో చికాకులు తలెత్తుతాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. 
 
కర్కాటకం :- ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. స్త్రీలు ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. గత అనుభవాలు జ్ఞప్తికివస్తాయి. ఖర్చులు, ఇతరత్రా అవసరాలు అధికంగా ఉంటాయి. వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారులకు పురోభివృద్ధి. మీ మాటతీరుతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు.
 
సింహం :- కుటుంబీకులతో కలసి ఉల్లాసంగా గడుపుతారు. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళుకువ అవసరం. మితిమీరిన ఆలోచనలు మీ మనస్సును వ్యాకులపరుస్తాయి. స్త్రీల అభిప్రాయాలకు స్పందన అంతంత మాత్రంగా ఉండటంతో ఒకింత నిరుత్సాహానికి లోనవుతారు. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు.
 
కన్య :- కుటుంబీకులతో కలసి విందు, వినోదాలలో పాల్గొంటారు. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. మీ శ్రీమతి సలహా పాటించటం వల్ల ప్రయోజనం ఉంటుంది. వృత్తిరీత్యా ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి, చుట్టుపక్కల వారి ప్రోత్సాహం లభిస్తుంది.
 
తుల :- ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయుయత్నాలు ఫలిస్తాయి. ఇప్పటివరకు మిమ్మల్ని అపార్థంచేసుకున్న వ్యక్తులు మీ సహాయం అర్థిస్తారు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. పెద్దల ఆశీస్సులు, ప్రముఖుల ప్రశంసలు పొందుతారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో బాగుగా రాణిస్తారు.
 
వృశ్చికం :- ఆత్మీయుల నుంచి అందిన ఆహ్వానం మిమ్ములను సందిగ్ధానికి గురిచేస్తుంది. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. సాహస ప్రయత్నాలు విరమించండి. ఫర్నీచర్ అమరికలకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
 
ధనస్సు :- పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. సంఘంలో గౌరవం లభిస్తుంది. పాత వస్తువులను కొని ఇబ్బందులను అధికంగా ఎదుర్కొంటారు. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
 
మకరం :- దూర ప్రయాణాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్త్రీలు షాపింగ్ దుబారా ఖర్చులు ఎక్కువగా చేస్తారు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. వ్యాపారాలు, సంస్థల అభివృద్ధికి బాగా శ్రమించాల్సి ఉంటుంది. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. దీర్ఘకాలిక సమస్యలను నుంచి బయటపడతారు.
 
కుంభం :- కాళ్ళు, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు. బాల్య మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రయాణాల్లో ఒకింత అసౌకర్యానికి లోనవుతారు. భాగస్వామిక సమావేశాల్లో కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. స్త్రీలు అందరి యందు కలుపుగోలు తనంగా వ్యవహరించడం వల్ల సమస్యలు తలెత్తుతాయి.
 
మీనం :- కొత్త వ్యాపారాలు ప్రారంభించే ముందు అన్ని క్షుణంగా పరిశీలించండి. ఊహించని ఖర్చులు, చెల్లింపుల వల్ల స్వల్ప ఆటుపోట్లు తప్పవు. మీ అభిప్రాయం సున్నితంగా వ్యక్తం చేయటం శ్రేయస్కరం. మీ ప్రయాణం, కార్యక్రమాలు వాయిదా పడతాయి. ప్రేమికుల ఆలోచనలు పెడదారి పట్టే ఆస్కారం ఉంది.