సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

16-06-2023 శుక్రవారం రాశిఫలాలు - ప్రతి మాసశివరాత్రికి ఈశ్వరునికి అభిషేకం...

Astrology
మేషం :- ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాల విషయాల్లో మీ వ్యూహం ఫలిస్తుంది. ప్రేమికుల మధ్య చికాకులు తలెత్తుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్, బదిలీ ఉత్తర్వులు చేతికందుతాయి. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. భర్యా, భర్తల మధ్య అవగాహన లేక చికాకులు వంటివి ఎదుర్కుంటారు. 
 
వృషభం :- ఆర్థిక స్థితి ఆశించిన విధంగా మెరుగు పడకపోవటంతో నిరుత్సాహం తప్పదు. రాజకీయ, కళలు, సినీరంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. రుణాల కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. వ్యాపారాల్లో స్వల్ప ఆటంకాలు మినహా ఇబ్బందులుండవు.
 
మిథునం :- స్త్రీల రచనలకు, కళాత్మతకు గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. సంతానం విద్యా విషయాలు, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తారు. దూర ప్రయాణాలపై ఒక నిర్ణయానికి వస్తారు. వాతావరణంలోని మార్పు రైతులలో ఆందోళన కలిగిస్తుంది. వైద్య రంగాలలోని వారికి పురోభివృద్ధి. ఆకస్మికంగా ఆరోగ్యంలో చికాకులు తలెత్తుతాయి.
 
కర్కాటకం :- వ్యాపారాల్లో స్వల్ప ఆటంకాలు మినహా ఇబ్బందులుండవు. సాహిత్య రంగాలలోని వారికి సంతృప్తి కానవస్తుంది. క్రయ విక్రయాలు ఊపందుకుంటాయి. రాబోయే ఖర్చులకు తగ్గట్టు ఆదాయం పెంచుకుంటారు. పెద్దల ఆరోగ్యములో మెళకువ వహించండి. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు క్షేమం కాదు. 
 
సింహం :- ఉద్యోగస్తులకు అధిక కృషి చేసి అధికారుల మెప్పు పొందుతారు. విదేశీయానాలకై చేయుయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రియతముల, చిన్నారుల వైఖరి మనస్థాపం కలిగిస్తుంది. వ్యాపారాల్లో స్వల్ప ఆటంకాలు మినహా ఇబ్బందు లుండవు.
 
కన్య :- ఆడిట్, అక్కౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికంగా ఉంటాయి. స్త్రీలు ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆకస్మికంగా ప్రయాణాలు అనుకూలిస్తాయి. స్త్రీలకు బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. రాజకీయాలలో వారు తొందరపడి వాగ్దానాలు చేయడం వల్ల సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. 
 
తుల :- బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఒత్తిడి, ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. మార్కెట్ రంగాల వారికి నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి. స్త్రీలకు ఆరోగ్య భంగం, వైద్యసేవలు తప్పకపోవచ్చు. పొదుపు పథకాలు, నూతన వ్యాపారాల దిశగా ఆలోచిస్తారు. ప్రేమికులకు మధ్య పెద్దల వల్ల సమస్యలు తలెత్తగలవు..
 
వృశ్చికం :- దైవదర్శనాలకై చేయుయత్నాలు ఫలిస్తాయి. ఉమ్మడి వెంచర్లు, పెట్టుబడుల విషయంలో పునరాలోచన అవసరం. ఒక యత్నం ఫలించటంతో మీలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. ఇచ్చిపుచ్చుకునే వ్యవహరాలు, ఒప్పందాల్లో మెలకువ వహించండి.
 
ధనస్సు :- ఇతరుల ముందు మీ ఉన్నతిని చాటుకునే యత్నాలు విరమించండి. స్త్రీలకు అతి ఉత్సాహం వల్ల విలువైన వస్తువులు జారవిడుచుకునే ఆస్కారం ఉంది. చిన్నతరహా, కుటీర పరిశ్రమలు, చిరు వ్యాపారులకు సామాన్యం. హామీలు, ఇతరులకు ధనసహాయం చేసే విషయంలో పునరాలోచన చాలా అవసరం.
 
మకరం :- మిత్రుల ద్వారా సహాయ సహకారములు అందుకుంటారు. ప్రణాళికాబద్ధంగా పనిచేసి సత్ఫలితాలను పొందుతారు. అవివాహితులలో నూతనోత్సాహం చోటుచేసుకుంటుంది. విద్యుత్ వస్తువులపట్ల ఏకాగ్రత చూపుతారు. ప్రముఖులను కలుసుకుంటారు. మీ కళత్ర మొండి వైఖరి వల్ల కుటుంబ సౌఖ్యం లోపిస్తుంది.
 
కుంభం :- ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. రాజకీయ రంగాల వారికి విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి.
 
మీనం :- ఆర్థిక విషయాల్లో అనుకోని ఇబ్బందుల ఎదురయ్యే సూచనలున్నాయి. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని అందరిని ఆకట్టుకుంటారు. ఉద్యోగస్తులకు ప్రయాణాలలో ఎక్కువ చికాకులు ఇబ్బందులను ఎదుర్కొంటారు. కళాకారులకు టీ.వి, నాటక రంగాల వారికి అవకాశాలు సద్వి నియోగమగును.