శుక్రవారం, 3 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

12-06-2023 శనివారం రాశిఫలాలు - ఈశ్వరుడిని పూజించి అర్చించినా మీకు శుభం

Aquarius
మేషం :- వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ ఉండదు. రుణాలు, చేబదుళ్లు ఇచ్చే విషయంలో జాగ్రత్త వహించండి. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిని ఇస్తాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్, బదిలీ ఉత్తర్వులు అందుతాయి. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. బంధువుల నుంచి విమర్శలను ఎదుర్కొంటారు. 
 
వృషభం :- ఆస్తి పంపకాలకు సంబంధించి సోదరులతో ఒప్పందం కుదుర్చుకుంటారు. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిది కాదు. ఉద్యోగం చేయు స్త్రీలకు దూరప్రాంతాలకు బదిలీలు అవుతారు. మీరంటే అందరికీ గౌరవం ఏర్పడుతుంది. వ్యాపారాభివృద్ధికి ఆర్థిక సంస్థల నుంచి ఋణం మంజూరవుతుంది. 
 
మిథునం :- శత్రువులు మిత్రులుగా మారి సహాయ సహాకారాలు అందిస్తారు. ప్రియతములతో సంబంధ బాంధవ్యాలు బాగుగా ఉంటాయి. ఇతరులకు వాహనం ఇచ్చిన ఇబ్బందులు తప్పవు. ధనం ఎంత వస్తున్నా నిల్వ చేయలేకపోతారు. దైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ప్రముఖులను కలుసుకుంటారు.
 
కర్కాటకం :- విద్యా, వైజ్ఞానిక విషయాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. బ్యాంకింగ్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. ఆలయాలను సందర్శిస్తారు. బంధు మిత్రుల వైఖరిలో మార్పు సంతోషం కలిగిస్తుంది. జీవనోపాధికి సొంతంగా ఏదైనా చేయాలి అనే ఆలోచన స్పురిస్తుంది. రవాణా రంగంలోని వారికి చికాకులు అధికమవుతాయి.
 
సింహం :- మధ్య మధ్య ఔషధసేవ తప్పదు. నిర్వహణ లోపం వల్ల వ్యాపార రంగంలోని వారికి సమస్యలు తలత్తే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. ఉమ్మడి, ఆర్థిక వ్యవహరాల్లో ఒక నిర్ణయానికి వస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలలో ఉల్లాసంగా గడుపుతారు. సోదరీ, సోదరులతో సఖ్యత నెలకొంటుంది.
 
కన్య :- స్థిరాస్తిని అమ్మటానికి చేయుప్రయత్నంలో పునరాలోచన మంచిది. ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. బృందా కార్యక్రమాలల్లో పాల్గొంటారు. స్త్రీలతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు చేపట్టవలసి ఉంటుంది. కంపెనీలో పనిచేయు వారికి సంతృప్తి కానవస్తుంది.
 
తుల :- వ్యాపారాభివృద్ధికి చేయుకృషిలో సామాన్య ఫలితాలనే పొందుతారు. మీ రాక బంధు మిత్రులకు సంతోషం కలిగిస్తుంది. ఉద్యోగ యత్నాలు ముమ్మరం చేస్తారు. ఖర్చులు ప్రయోజనకరంగా ఉంటాయి. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాల్లో రాణిస్తారు. కోర్టు వ్యవహరాలు వాయిదా పడటంతో నిరుత్సాహం చెందుతారు.
 
వృశ్చికం :- బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. సోదరీ సోదరులతో విభేదాలు తప్పవు. ఉద్యోగస్తులు తరుచూ యూనియన్ కార్యకలాపాలు, సమావేశాల్లో పాల్గొంటారు. విద్యార్థులకు హడావుడి, తొందరపాటు తగదు. స్త్రీల ఉద్యోగయత్నం ఫలిస్తుంది. వృత్తిపరంగా ప్రముఖులను కలుసుకుంటారు.
 
ధనస్సు :- మిమ్ములను వ్యతిరేకించిన వారే మీ సాన్నిత్యం కోరుకుంటారు. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు, ప్రదేశాలకు అలవాటుపడతారు. వాహన చోదకులు, యాజమానులు అప్రమత్తంగా ఉండాలి. కుటుంబానికి కావలసిన వస్తువులు సమకూర్చుకుంటారు. శారీరక శ్రమ, విశ్రాంతి లోపం వల్ల స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది.
 
మకరం :- ఆర్థికంగా ఎదగటానికి మీరు చేసే యత్నాలు ఫలిస్తాయి. సాంఘిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగును. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం. మనోధైర్యంతో ఎంతటి కార్యానైనా సాధించగలుగుతారు. ప్రేమికులకు పెద్దల నుంచి తీవ్ర వ్యతిరేకత ఇతరత్రా చికాకులు అధికమౌతాయి.
 
కుంభం :- వృత్తి వ్యాపారాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించి సత్ఫలితాలు సాధిస్తారు. పత్రిక, వార్తా మీడియా వారికి ఊహించని సమస్యలెదురవుతాయి. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమ సమాచారాలు సంతృప్తినిస్తాయి. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి.
 
మీనం :- నిరుద్యోగులు బోగస్ ప్రకటనల వల్ల నష్టపోయే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. ఒక వ్యవహారం నిమిత్తం ప్లీడర్లతో సంప్రదింపులు జరుపుతారు. ఆధ్మాత్మిక సమావేశాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి అమ్మకంపై ఒత్తిడి, ఆందోళనలకు గురవుతారు. రాబోయే ఆదాయానికి తగినట్టుగా ప్రణాళికలు రూపొందించుకుంటారు.