గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

21-06-2023 బుధవారం రాశిఫలాలు - గాయిత్రి మాతను ఆరాధించిన శుభం...

Gemini
మేషం :- ఆర్థిక పరిస్థితిలు మెరుగుపడతాయి. ఒక యత్నం ఫలించటంతో మీలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. వాతావరణంలోని మార్పు రైతులలో ఆందోళన కలిగిస్తుంది. నూతన జీవితాన్ని సాగిస్తారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండటం శ్రేయస్కరం. పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. మీ సంతానం కోసం ధనం అధికంగా ఖర్చుచేస్తారు.
 
వృషభం :- రావలసిన ధనం కోసం ప్రయాసలు ఎదుర్కుంటారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు ఆశించినంత సంతృప్తినీయవు. వృత్తుల వారికి అన్ని విధాలా కలిసిరాగలదు. ప్రముఖుల సహకారంతో ఒక సమస్య నుంచి బయటపడతారు. పేరు, ప్రఖ్యాతలు లభిస్తాయి. బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి. 
 
మిథునం :- ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. విద్యార్థినులకు ప్రేమ వ్యవహరాల్లో లౌక్యం అవసరం. కొంతమంది మీ ఆలోచనలను తప్పుదారి పట్టించేందుకు ఆస్కారం ఉంది. తలచిన కార్యాలు ఆలస్యంగా అమలుపరుస్తారు. ఇతరుల నిర్ణయాలను గౌరవిస్తారు. విద్యా, వృత్తిరంగాల్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.
 
కర్కాటకం :- ఉద్యోగస్తులు ఒత్తిడి, ప్రలోభాలకు పోకుండా పట్టుదలతో వ్యవహరించటం మంచిది. నిరుద్యోగుల ఆలోచనలు ఉపాధి పథకాల దిశగా సాగుతాయి. దాన ధర్మాలు చేయడంవల్ల మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. జీవితంలో మార్పులను కోరుకుంటారు. ఆస్తి వ్యవహార విషయమై పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు.
 
సింహం :- ఇతరుల విషయలకు, హామీలకు దూరంగా ఉండటం మంచిది. ఖర్చులు, అవసరాలు పెరగటంతో అదనపు రాబడికైయత్నిస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. గతంలో నిలిచిపోయిన ఉద్యోగ యత్నాలు లాభిస్తాయి. గృహ మరమ్మతులు, మార్పులు చేపడతారు. కొన్ని పనులు అనుకోకుండా పూర్తవుతాయి.
 
కన్య :- మీ పనులు మందకొడిగా సాగుతాయి. మీ బలహీనతలు, అలవాట్లు ఇబ్బందులకు దారితీస్తాయి. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. దైవ, సేవా, పుణ్య కార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కుటుంబ కలహాలకు దూరంగా ఉండటం మేలు. భాగస్వామిక సమావేశాల్లో కొత్త వ్యక్తులు పరిచయమవుతారు.
 
తుల :- చేపట్టిన పనులు విసుగు కలిగించినా మొండిగా పూర్తి చేస్తారు. కొత్త సమస్యలు తలెత్తే సూచనలున్నాయి. జాగ్రత్త వహించండి. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. సమయాన్ని బట్టి పనులను చక్కబెట్టుకుంటారు. ఫైనాన్సు, చిట్ ఫండ్, బ్యాంకింగ్ రంగాలలో వారికి ఒత్తిడి పెరుగుతుంది.
 
వృశ్చికం :- నిరుద్యోగులు ఒక మంచి అవకాశం నిమిత్తం దూరప్రాంతాలకు వెళ్ళవలసి ఉంటుంది. ఉత్తరప్రత్యుత్తరాలు ఆశించినంత సంతృప్తికరంగా సాగవు. ఆశించిన రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు. ప్రతి చిన్న విషయానికి చికాకులకు లోనవుతారు. స్త్రీలు ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి.
 
ధనస్సు :- మితిమీరిన ఆలోచనలు మీ మనస్సును వ్యాకుల పరుస్తాయి. తొందరపాటు నిర్ణయాలు తగవు. అవివాహితుల్లో ఉత్సాహం నెలకొంటుంది. కొంతమంది మీరు చేసిన వ్యాఖ్యానాలను వక్రీకరించే యత్నం చేస్తారు. రాబడికి మించిన ఖర్చులుండటంతో అదనపు ఆదాయ మార్గాలపై మీ ఆలోచనలుంటాయి.
 
మకరం :- సామాజిక, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. ప్రేమ వ్యవహారాలలో విజయం పొందటానికి మరికాస్త కృషి చేయాలి. మీరు చేయు యత్నాలకు సన్నిహితుల సహాయ సహకారం లభిస్తుంది. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలు సత్ఫలితాలనిస్తాయి. ప్రయాణాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
కుంభం :- గత కొంత కాలంగా కుటుంబంలోని వివాదాలు తొలగిపోతాయి. ప్రముఖులను కలుసుకుంటారు. ఉత్తరప్రత్యుత్తరాలు ఆశించినంత సంతృప్తికరంగా సాగవు. కుటుంబానికి మీరు అవసరం కనుక వ్యసనాలకు దూరంగా ఉండండి. నిరుద్యోగులకు ఒక మంచి అవకాశం నిమిత్తం దూరప్రాంతాలకు వెళ్ళవలసి ఉంటుంది.
 
మీనం :- ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికమవుతాయి. తలపెట్టిన పనులు నిర్విఘ్నముగా పూర్తి చేస్తారు. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోవటం మంచిది. దూర ప్రయాణాలు కలిసివస్తాయి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి కలిసివ వచ్చేకాలం. అద్దె ఇంటి కోసంచేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.