శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

31-10-2023 మంగళవారం రాశిఫలాలు - రాఘవేంద్రస్వామిని పూజించినా సర్వదా శుభం...

astrolgy
శ్రీ శోభకృత్ నామ సం|| ఆశ్వీయుజ బ॥ తదియ రా.10.53 రోహిణి తె.6.08 రా.వ.10.04 ల 11.41. ఉ. దు. 8.16 ల 9.04 రా.దు. 10.37 ల 11.26.
 
రాఘవేంద్రస్వామిని పూజించినా సర్వదా శుభం, జయం, పురోభివృద్ధి కానవస్తుంది.
 
మేషం :- మీపై మీకే నమ్మకం తగ్గుతుంది. రవాణా, ఆటోమోబైల్, మెకానికల్ రంగాలలో వారికి సంతృప్తి కానవస్తుంది. మీ సంతానం మొండి వైఖరి మీకు ఒత్తిడి, చికాకు కలిగిస్తుంది. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. పాత సమస్యలు పరిష్కారంతో మానసికంగా కుదుటపడతారు.
 
వృషభం :- ఆర్థిక విషయాలలో ఒక అడుగు ముందుకు వేస్తారు. పాత మిత్రుల కలయికతో గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. అపార్థాలు మాని ఇతరులను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి. కళ, క్రీడ, సాంకేతిక రంగాల వారికి ప్రోత్సాహకరం. ఏ విషయంలోను ఎదుటివారిని అతిగా విశ్వసించటం అంత మంచికాదు.
 
మిథునం :- స్వయంకృషితోనే అనుకున్నది సాధిస్తారు. రాబోయే ఆదాయానికి తగినట్టుగా ప్రణాళికలు రూపొందించుకుంటారు. ఇతరులకు వాహనం ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. అకాల భోజనం, మితిమీరిన శ్రమ వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. శత్రువులు మిత్రులుగా మారతారు. వ్యాపారాల్లో పెరిగిన పోటీని తట్టుకుంటారు.
 
కర్కాటకం :- స్త్రీలకు ఆరోగ్యంలో తగు జాగ్రత్తలు అవసరం. ఆకస్మికంగా సన్నిహితులతో మార్పులు కానవస్తాయి. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. పాత రుణాలు తీరుస్తారు. ఏ యత్నం కలిసిరాక నిరుద్యోగులు అనుక్షణం అశాంతికి లోనవుతారు. వ్యాపారాల్లో నష్టాలను కొంత మేరకు అధికమిస్తారు.
 
సింహం :- లిటిగేషన్ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. తోటలు కొనుగోలుకై చేయుప్రయత్నాలు ఫలిస్తాయి. సోదరి సహకారం లభిస్తుంది. బంధువులను కలుసుకుంటారు. విదేశీయానం కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. స్థిరచరాస్తుల విషయం గురించి చర్చిస్తారు. బంగారు, వస్త్ర, వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది.
 
కన్య :- వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలుదార్లను ఆకట్టుకుంటాయి. అధైర్యం వదలి ధైర్యంతో ముందుకు సాగి జయం పొందండి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడుట మంచిది. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. ఉద్యోగాభివృద్ధికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి.
 
తుల :- గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. విదేశాలు వెళ్ళడానికి చేయుప్రయత్నాలు ఫలిస్తాయి. ఊహించని అవకాశాలు వస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. కీర్తి ప్రతిష్ఠలకు కించిత్ భంగం వాటిల్లే సూచనలున్నాయి. రుణాల కోసం అన్వేషిస్తారు. ఉద్యోగ యత్నంలో నిరుద్యోగులకు బిడియం, అభిమానంకూడదు.
 
వృశ్చికం :- స్త్రీలు తెలివి తక్కువగా వ్యవహరించడం వలన చేపట్టిన పనికొంత ముందు వెనుకలుగానైనా జయం చేకూరగలదు. పెద్ద హోదాలో ఉన్న వారికి అధికారిక పర్యటనలు అధికమవుతాయి. ప్రయత్నపూర్వకంగా కొన్ని అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలుదార్లను ఆకట్టుకుంటాయి.
 
ధనస్సు :- ప్రైవేటు సంస్థలలోవారు వారి అశ్రద్ధ, ఆలస్యాలవలన ప్రభుత్వ అధికారుల నుంచి చికాకులు ఎదుర్కుంటారు. ఫ్యాన్సీ, వస్త్ర, కిరాణా, కిళ్లి రంగాలలోవారికి కలిసిరాగదు. ఉద్యోగరీత్యా దూర ప్రయాణాలు ఆందోళన కలిగిస్తాయి. రావలసిన ధనం చేతికందటంతో మీలో పలు ఆలోచనలు చోటు చేసుకుంటాయి.
 
మకరం :- వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు. సంగీత కళాకారులకు ప్రోత్సాహం లభిస్తుంది. కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ రంగాల్లో వారికి సదావకాశాలు లభిస్తాయి. దంపతుల మధ్య కలహాలు అధికమవుతాయి. కంపెనీల ప్రభుత్వ సంస్థలతో లావాదేవీలు ఫలిస్తాయి. చిన్నతరహా పరిశ్రమలలో వారికి అభివృద్ధి కానవస్తుంది.
 
కుంభం :- బ్యాంకింగ్ రంగాల వారికి పనిలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. స్త్రీలకు బంధువులతో పట్టింపులొస్తాయి. నిరుద్యోగులకు ఉపాధి పథకాల పట్ల ఆసక్తి ఏర్పడుతుంది. జీవనోపాధికి సొంతంగా ఏదైనా చేయాలి అనే ఆలోచన స్ఫురిస్తుంది. ముఖ్యుల పట్ల ఆరాధన పెరుగుతుంది. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. 
 
మీనం :- కాంట్రాక్టర్లకు ఇప్పటివరకు వాయిదా పడుతున్న పనులు పునఃప్రారంభమవగలవు. రాజకీయాలలో వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. స్త్రీలు వస్త్రములు, ఆభరణములు వంటి వస్తువులు కొనుగోలు చేస్తారు. పట్టువిడుపు ధోరణితోనే మీ సమస్యలు పరిష్కారమవుతాయి. ముఖ్యంగా ప్రింట్, మీడియాలో ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి.