1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
  4. Today Daily Astrology dated on 12th March'2022

12-03-2022 శనివారం రాశిఫలాలు - శ్రీరామును పూజించిన శుభం

Daily Horoscope
మేషం :- విదేశీయాన యత్నాల్లో సఫలీకృతులవుతారు. ఆర్థిక పరిస్థితిల్లో ఆశాజనకమైన మార్పులు చోటుచేసుకుంటాయి. తొందరపడి వాగ్దానాలు చేసి సమస్యలు తెచ్చుకోకండి. బ్యాంకు వ్యవహారాలలో మెళుకువ అవసరం. నూతన పెట్టుబడులు పెట్టునపుడు మెళుకువ అవసరం. వాహనం మరమ్మతులకు గురవుతుంది.
 
వృషభం :- పెట్టిపోతలు, ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు సానుకూలమవుతాయి. పత్రికా సంస్థలలోనివారికి ఉద్యోగ భద్రత విషయంలో ఆందోళన తప్పదు. స్టేషనరీ, ప్రింటింగు రంగాలలో వారికి సంతృప్తి. పారిశ్రామిక రంగాల వారికి కార్మికులు, విద్యుత్ సమస్యలు అధికం. మీ సంతానం విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తారు.
 
మిథునం :- వృత్తి వ్యాపారాల్లో స్థిరపడటంతో పాటు ఇతరులకు మార్గదర్శకమవుతారు. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు. ప్రేమికులకు పెద్దల నుంచి వ్యతిరేకత, ఇతరత్రా చికాకులు అధికమవుతాయి. అవసరానికి రుణాలు సకాలంలో అందవు. విదేశీయానం కోసం చేసే యత్నాలకు అడ్డంకులు తొలగిపోగలవు.
 
కర్కాటకం :- ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొన్న నెమ్మదిగా సమసిపోతాయి. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదా పడతాయి. తరుచూ అధికారులు, నేతలతో సంప్రదింపులు జరుపుతారు. శత్రువులు మిత్రులుగా మారి సహాయం అందిస్తారు. కోర్టు వ్యవహారాలు విచారణకు వస్తాయి. ఒక ఆహ్వానం మిమ్ములను ఇబ్బందికి గురిచేస్తుంది.
 
సింహం :- స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సోదరులతో ఏకీభవించలేకపోతారు. ఆకస్మిక ప్రయాణం తల పెడతారు. బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ బాధ్యతలు పెరగటంతో పాటు పనిభారం అధిక మవుతుంది. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనలు, అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం.
 
కన్య :- ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. బంధువుల ఆకస్మిక రాక అసహనం కలిగిస్తుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు మందకొడిగా సాగుతాయి. కొత్త వ్యక్తులను అతిగా నమ్మటం మంచిది కాదు. అవివాహితల్లో నూతనోత్సాహం చోటు చేసుకుంటుంది.
 
తుల :- వ్యవసాయ, తోటల రంగాల్లో వారికి పురోభివృద్ధి పొందుతారు. గృహ నిర్మాణాలు, మరమ్మతులు అనుకూలిస్తాయి. స్త్రీలు షాపింగుల్లోనూ, కొత్త వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులు పెండింగ్ పనులపై దృష్టి సారిస్తారు. ప్రముఖులను కలుసుకుంటారు. రావలసిన ధనంలో కొంత మొత్తం అందుకుంటారు.
 
వృశ్చికం :- చిన్ననాటి వ్యక్తుల కలయికతో గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. బ్యాంకింగ్ రంగాల్లో వారికి ఒత్తిడి, చికాకులు తప్పదు. మీ పొదుపరితనం కుటుంబీకులకు చికాకు, ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థినుల ఆలోచనలు పక్కదారి పట్టే ఆస్కారం ఉంది. పెద్దమొత్తం ధనసహాయం చేసే విషయంలో లౌక్యంగా ఉండాలి.
 
ధనస్సు : - శస్త్ర చికిత్సల సమయంలో వైద్యులకు ఏకాగ్రత, ఓర్పు ఎంతో అవసరం. రాజకీయాల్లో వారికి అనుకోని మార్పు కానరాగలదు. ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం. స్త్రీల కళాత్మతకు, నైపుణ్యతకు మంచి గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. మీ కళత్ర మొండి వైఖరి మీకెంతో ఆందోళన కలిగిస్తుంది.
 
మకరం :- గృహంలో విలువైన వస్తువులు అమర్చుకోవాలనే మీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది. దుబారా నివారించ లేకపోవడం వల్ల ఆందోళన తప్పదు. ఇతరుల గురించి హాస్యానికై మీరు చేసిన వ్యాఖ్యానాల వల్ల ఊహించని సమస్యలు తలెత్తుతాయి. సాహస యత్నాలకు సరైన సమయం కాదని గ్రహించండి. ప్రయాణాలు అనుకూలం.
 
కుంభం :- పెంపుడు జంతువులపట్ల ఆసక్తి అధికమవుతుంది. ఏదైనా స్థిరాస్తి అమ్మకానికై చేయుయత్నం వాయిదా వేయండి. కొబ్బరి, పండ్లు, పూలు చల్లని పానీయ వ్యాపారులకు లాభదాయకం. సర్టిఫికెట్లు, హాల్ టిక్కెట్ల విషయంలో విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి. అనుభవజ్ఞుల సహాయంతో వృత్తి నైపుణ్యం పెంచుకుంటారు.
 
మీనం :- రిప్రజెంటేటిన్లు, ప్రైవేటు సంస్థలోని వారికి ఓర్పు, అంకితభావంతో పనిచేసి మంచి గుర్తింపు, రాణింపు పొందుతారు. అనవసరపు సంభాషణల వల్ల ముఖ్యులతో ఆకస్మిక భేదాభిప్రాయాలు తలెత్తే ఆస్కారం ఉంది. మీ అభిప్రాయం చెప్పటానికి సందర్భవస్తుంది. హోటల్ తినబండ వ్యాపారులకు కలిసివచ్చేకాలం. 
About Writer
రామన్
తర్వాతి కథనం
13-03-2022 నుంచి 19-03-2022 వరకు మీ వార రాశిఫలాలు