శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

08-03-2022 మంగళవారం రాశిఫలాలు - కార్తీకేయుడిని పూజించినా..

మేషం :- వస్త్ర, పచారీ, ఫ్యాన్సీ వ్యాపారులకు మందకొడిగా ఉంటుంది. బంధు మిత్రుల కలయిక వలన నూతన ఉత్సాహం చోటు చేసుకుంటుంది. ఊహించని వ్యక్తుల నుంచి అందిన సమాచారం మీకు బాగా ఉపకరిస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. మీ సంతానం కోసం విరివిగా ధన వ్యయం చేస్తారు.
 
వృషభం :- విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. స్త్రీల మాటకు వ్యతిరేకత ఎదురవుతుంది. కొబ్బరి, పూలు పండ్లు, చల్లనిపానియ వ్యాపారులకు లాభదాయకం. సమయానుకూలంగా మీ కార్యక్రమాలు మార్చుకోవలసి ఉంటుంది. ఆడిట్, అకౌంట్స్ ‌రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికంగా ఉంటాయి.
 
మిథునం :- ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ప్రసంశలు పొందుతారు. దైవ, పుణ్య, సేవా కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడుట మంచిది. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో నిలదొక్కుకోవటానికి నిరంతర శ్రమ, ఓర్పు ఎంతో ముఖ్యం. ఆపద సమయంలో సన్నిహితులు అదుకుంటారు.
 
కర్కాటకం :- స్థిరాస్తి క్రయ విక్రయాలకు సంబంధించిన వ్యవహారాలలో మెళకువ అవసరం. ఇతరులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాణిజ్య ఒప్పందాలు, భాగస్వామిక చర్చలలో అనుకూలిస్తాయి. విద్యార్ధులకు ఒత్తిడి, ఆందోళన అధికమవుతాయి. ఓర్పు, పట్టుదలతో శ్రమించి మీరు అనుకున్నది సాధిస్తారు.
 
సింహం :- మీ నిర్లక్ష్యం వల్ల విలువైన వస్తువుల చేజారిపోతాయి. ఆహార, ఆరోగ్యంలో మెలకువ అవసరం. ఆడిట్, అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికంగా ఉంటాయి. మీ పనులు మందకొడిగా సాగటం, జాప్యం వంటి చికాకులు ఎదుర్కుంటారు. మీ ముఖ్యుల కోసం ధనం బాగుగా వెచ్చించవలసి ఉంటుంది.
 
కన్య :- స్త్రీలకు ఆహ్వానాలు, వస్త్ర, వస్తులాభం వంటి శుభ ఫలితాలుంటాయి. ప్రేమికుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. లౌక్యంగా వ్యవహరించటం వల్ల కొన్ని వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు అధికారులతో సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది మెళకువ అవసరం. వాహనం నదుపునపుడు జాగ్రత్త అవసరం.
 
తుల :- గృహంలో మార్పులు వాయిదా పడతాయి. కుటుంబీకులతో అవగాహన లోపిస్తుంది. ఉద్యోగస్తులు తోటివారి కారణంగా అధికారులతో మాటపడక తప్పదు. కోర్టు వ్యవహరాలు ఆందోళన కలిగిస్తాయి. ఖర్చులు పెరగటంతో రుణయత్నాలు, చేబదుళ్ళు తప్పవు. విద్యార్థుల్లో మానసిక ప్రశాంతత చోటుచేసుకుంటుంది.
 
వృశ్చికం :- స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. ఏజెంట్లు, బ్రోకర్లు, వృత్తుల వారికి మిశ్రమఫలితం. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాల్లో క్రమేణా నిలదొక్కుకుంటారు. నూతన దంపతులకు కొత్త కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. విద్యార్థులకు ఒత్తిడి, నిరుత్సాహం తప్పవు. క్రయ విక్రయాలు సామాన్యం.
 
ధనస్సు :- విద్యార్థులు భయాందోళనలు విడనాడి శ్రమించిన సత్ఫలితాలు పొందుతారు. దైవ, శుభకార్యాల్లో పాల్గొంటారు. ఉన్నతస్థాయి అధికారులు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. ఉద్యోగస్తులకు స్థానచలనంతో పాటు బరువు బాధ్యతలు అధికమవుతాయి. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది.
 
మకరం :- మీ సంతానం కోసం ధనం బాగా వ్యయం చేస్తారు. చేసే పనిలో ఏకాగ్రత, పట్టుదల ఎంతో ముఖ్యమని గమనించండి. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. నిరుద్యోగులకు సదాకాశాలు లభిస్తాయి. వాహనం నడుపుతున్నపుడు మెలకువ వహించండి. మిత్రుల ద్వారా అందిన ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది.
 
కుంభం : ఉద్యోగస్తులు సమర్థంగా పనిచేసి అధికారులను మెప్పిస్తారు. ప్రయాణాలు, బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ముఖ్యుల కోసం ధన వ్యయం చేస్తారు. స్త్రీలకు అధిక శ్రమ, ఒత్తిడి వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. విద్యార్థినులు ఒత్తిడి, ఆందోళనలకు గురవుతారు.
 
మీనం :- స్త్రీలకు వాహనం నడుపుతున్నపుడు, షాపింగ్ వ్యవహారాల్లో ఏకాగ్రత అవసరం. రాబడికి మంచిన ఖర్చులు, తప్పనిసరి చెల్లింపుల వల్ల స్వల్ప ఆటుపోట్లు ఎదుర్కొంటారు. బంధువుల రాకతో కుటుంబంలో చికాకులు అధికంగా ఉంటాయి. ఓర్పు, సహనంతో వ్యవహరించి సమస్యలను పరిష్కరించుకుంటారు.