శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

04-03-2022 శుక్రవారం రాశిఫలాలు - లక్ష్మీదేవిని పూజించి, అర్చించిన శుభం..

మేషం :- ఉద్యోగస్తులకు అధికారుల వైఖరి నిరుత్సాహం కలిగిస్తుంది. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారాభివృద్ధికి చేయుకృషిలో ఫలితాలు సామాన్యంగా ఉంటాయి. ప్రైవేటు సంస్థల్లో వారికి యాజమాన్యం నుంచి ఒత్తిడి, చికాకులు తప్పవు. స్త్రీలకు రచనలు, కళల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
వృషభం :- రాజకీయ, కళా రంగాలకు చెందినవారు లక్ష్యాలు సాధిస్తారు. ఆలయ సందర్శనాల కోసం ధనం అధికంగా ఖర్చు చేస్తారు. కుటుంబీకులతో ఏకీభవించలేరు. పీచు, నార, ఫోము, లెదర్ వ్యాపారస్తు యోగప్రదం. స్త్రీలకు అదనపు సంపాదన పట్ల దృష్టి సారిస్తారు. తల, పొట్టకి సంబంధించిన చికాకులు అధికమవుతాయి.
 
మిథునం :- ఉద్యోగస్తులకు ఏకాగ్రత లోపం వల్ల పై అధికారులతో మాటపడవలసి వస్తుంది. బ్యాంకు వ్యవహారాలలో ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ప్రతి విషయంలోను బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. ముఖ్యుల పట్ల ఆరాధన పెరగగలదు. వ్యాపారాల్లో కొత్త కొత్త పథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు.
 
కర్కాటకం :- అవివాహితులు కొత్త అనుభూతికి లోనవుతారు. రుణయత్నాలు ఏమాత్రం ముందుకు సాగవు. ఊహించని ఖర్చులు, వాయిదాల చెల్లింపుల వల్ల ఒకింత ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. తోటల రంగాల వారికి దళారీల నుంచి ఒత్తిడి అధికంగా ఉంటుంది.
 
సింహం :- యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. సంఘంలో ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు మీ పురోభివృద్ధికి తోడ్పడతాయి. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో అపరిచిత వ్యక్తులతో మెళుకువ అవసరం. స్త్రీలకు విలాసాలు, అలంకారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
కన్య :- ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సమస్యలు సమర్థంగా పరిష్కరిస్తారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి త్రిప్పట అధికమవుతాయి. నిర్మాణ పనుల్లో నాణ్యత లోపం వల్ల కాంట్రాక్టర్లు, బిల్డర్లకు చికాకులను ఎదుర్కొంటారు. ప్రియమైన వ్యక్తుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. విద్యార్థుల్లో మనోధైర్యం పెంపొందుతుంది.
 
తుల :- పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడి, చికాకులు తప్పవు. పెద్దల ఆరోగ్యం కోసం ధనం విరివిగా వ్యయమవుతుంది. బ్యాంకు డిపాజిట్లు దీర్ఘకాలిక పెట్టుబడులు అనుకూలం. నిరుద్యోగుల ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత అవసరం. ఉపాధ్యాయులకు బరువు బాధ్యతలు అధికమవుతాయి. పాత స్నేహితులను కలుసుకుంటారు.
 
వృశ్చికం :- బంధు మిత్రుల రాకపోకలు అధికంగా ఉంటాయి. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, తగు ప్రోత్సాహం లభిస్తాయి. కుటుంబంలో స్వల్ప చికాకులు ఎదురైనా క్రమేణా పరిస్థితులు చక్కబడతాయి. కొబ్బరి, పండ్ల, పూల, నిత్యావసర వస్తు వ్యాపారులకు కలిసివస్తుంది. చేపట్టిన పనులలో చికాకులు, ఒత్తిడి ఎదుర్కోవలసి వస్తుంది.
 
ధనస్సు :- పన్నులు, బీమా, బిల్లులు పరిష్కారం అవుతాయి. విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. రాజకీయాలలో వారికి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఖర్చుల విషయంలో ప్రణాళికా బద్ధంగా వ్యవహరిస్తారు. వాహనం, విలువైన వస్తువులు అమర్చుకుంటారు.
 
మకరం :- మీ రాక బంధువులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. ప్రముఖులను కలుసుకుంటారు. ప్లీడర్లకు తమ క్లయింట్లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. ప్రత్యర్థులు మీ శక్తి సామర్థ్యాలను గుర్తిస్తారు. పారిశ్రామిక రంగాల వారికి అన్ని విధాలా ప్రోత్సాహకరం. దంపతుల మధ్య నూతనోత్సాహం చోటుచేసుకుంటుంది.
 
కుంభం :- స్త్రీలు గృహోపకరణాలకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మొహమ్మాటం, ఒత్తిడి ఎదుర్కుంటారు. హోటల్, క్యాటరింగ్ పనివారలకు కలిసిరాగలదు. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ధన వ్యయం చెల్లింపులకు సంబంధించిన విషయాల్లో ఏకాగ్రత అవసరం.
 
మీనం :- భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఎన్ని అవరోధాలు ఎదురైనా మనోధైర్యాన్ని కోల్పోతారు. పోగొట్టుకున్న వస్తువులను తిరిగి దక్కించుకుంటారు. ఉద్యోగస్తుల శక్తిసామర్థ్యాలకు గుర్తింపు లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. రుణాలు చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. సోదరులు మీతో అన్ని విషయాల్లోను ఏకీభవిస్తారు.