శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

07-03-2022 సోమవారం రాశిఫలాలు - మల్లికార్జునుడిని ఆరాధించిన మీ...

మేషం :- ఆడిట్, అక్కౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికం. ప్రైవేటు సంస్థలలోని వారికి, పత్రికా, వార్తా మీడియా వారికి ఏకాగ్రత ముఖ్యం. రావలసిన ధనం అందటంతో పొదుపు పథకాల దిశగా ఆలోచనలు సాగిస్తారు. వ్యాపారాల్లో ఎదురైన పోటీని తట్టుకోవటానికి ఆకర్షణీయమైన పథకాలు అమలుచేయండి.
 
వృషభం :- ఆర్థిక, కుటుంబ సమస్యలకు చక్కని పరిష్కారం లభిస్తుంది. ప్రైవేటు సంస్థలలోని వారికి పనిభారం అధికం. ప్రేమికులలో నూతనోత్సాహం నెలకొంటుంది. ఏజెంట్లు, మార్కెటింగ్ రంగాల వారుటార్గెట్లు పూర్తి కాగలవు. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే కోరిక బలీయమవుతుంది. స్త్రీల కోరికలు, అవసరాలు నెరవేరగలవు.
 
మిథునం :- సంఘంలో మీ గౌరవ ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. శారీరక శ్రమ, మితిమీరిన ఆలోచనలవల్ల స్వల్ప అస్వస్థతకు లోనవుతారు. స్త్రీలకు అయిన వారి నుంచి కావలసిన సమాచారం అందుతుంది. అధికారులకు కిందిస్థాయి సిబ్బందితో చికాకులు తప్పవు. మొహమ్మాటాలకు పోయి కోరి కష్టాలు తెచ్చుకున్న వారవుతారు.
 
కర్కాటకం :- ఉద్యోగస్తులకు యూనియన్ కార్యకలాపాల వల్ల క్షణం తీరిక ఉండదు. ఒక వేడుకను ఘనంగా చేయటానికి సన్నాహాలు మొదలెడతారు. వృత్తి వ్యాపారాల్లో స్థిరపడటంతో పాటు ఇతరులకు మార్గదర్శకమవుతారు. అవివాహితులకు శుభవార్తలు అందుతాయి. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి.
 
సింహం :- ఆస్తి పంపకాలు, కోర్టు వ్యవహారాలు పరిష్కార దిశగా సాగుతాయి. మీ పనులు, కార్యక్రమాలకు చక్కని ప్రణాళికలు రూపొందించుకుంటారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఉన్నతస్థాయి అధికారులు పై సంపాదన పట్ల ఆసక్తి తగ్గించుకోవటం క్షేమదాయకం. కొంతమంది మిమ్ములను ఇరకాటానికి గురిచేసేందుకు యత్నిస్తారు.
 
కన్య :- స్త్రీలకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగ, వ్యాపారాల్లో తలెత్తిన ఆటంకాలను తెలివిగా అధికమిస్తారు. మీకెదురైన అనుభవంతో మనస్సు మార్చుకుంటారు. అనుకున్న పనులు మొదలెట్టే సమయానికి ఏదో ఒక అవాంతరం వచ్చిపడుతుంది.
 
తుల :- స్త్రీలలో సంపాదన పట్ల ఆసక్తి మరింత బలపడుతుంది. శారీరక శ్రమ, విశ్రాంతి లోపం వల్ల స్వల్ప అస్వస్థతకు గురవుతారు. స్థిరచరాస్తులు విక్రయించాలనే ఆలోచన విరమించుకోవటం మంచిది. కొన్ని విషయాల్లో మీ ప్రమేయం లేకున్నా మాటపడక తప్పదు. ఉద్యోగస్తుల శ్రమ, సమర్థతలకు మంచి గుర్తింపు లభిస్తుంది.
 
వృశ్చికం :- ముఖ్యుల గురించి ఆందోళన చెందుతారు. స్త్రీలకు ఏ విషయంలోను ఆసక్తి పెద్దగా ఉండదు. విద్యార్థులకు ప్రేమ వ్యవహారాలు నిరుత్సాహం కలిగిస్తాయి. కొన్ని అవకాశాలు అనుకోకుండా కలిసివస్తాయి. ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు అధికారులతో కొత్త సమస్యలు అధికం. బంధువులను, ప్రముఖులను కలుసుకుంటారు.
 
ధనస్సు :- మందులు, రసాయనాలు, ఆల్కహాలు, సుగంధ ద్రవ్య వ్యాపారులకు కలిసిరాగలదు. బంధు మిత్రుల ద్వారా కొత్త విషయాలు గ్రహిస్తారు. తరుచు సన్మానాలు, సభల్లో పాల్గొంటారు. కీలకమైన వ్యవహారాల్లో అనుభవజ్ఞుల సలహా పాటించండి. స్త్రీల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు శారీరకంగా బలం పుంజుకుంటారు.
 
మకరం :- వ్యాపారాభివృద్ధికి నూతన ప్రణాళికలు రూపొందిస్తారు. నిరుద్యోగులకు సమాచార లోపం వల్ల ఒక అవకాశం చేజారిపోతుంది. విద్యార్థినులలో భయాందోళనలు అధికమవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు స్వయంగా చూసుకోవటం మంచిది. గృహ నిర్మాణాలలో స్వల్ప అడ్డంకులు, చికాకులు ఎదుర్కుంటారు.
 
కుంభం :- కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లుల వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. విద్యార్థులకు విద్యా విషయాల పట్ల ఏకాగ్రత అవసరం. బంధువుల వల్ల కార్యక్రమాలకు స్వల్ప ఆటంకాలెదురవుతాయి. కార్యసాధనలో పట్టు, ఓర్పు ముఖ్యమని గమనించండి. ప్రముఖ కంపెనీల షేర్ల విలువలు పెరిగే సూచనలున్నాయి.
 
మీనం :- వ్యాపారాల అభివృద్ధికి మరింతగా శ్రమించాలి. మీ యత్నాలకు కుటుంబీకులు, సన్నిహితుల ప్రోత్సాహం లభిస్తుంది. నూతన పెట్టుబడులు, లీజు, ఏజెన్సీలు, కాంట్రాక్టులకు అనుకూలం. వృత్తిపరంగా ఎదురైన ఆటంకాలను అధికమిస్తారు. ఉద్యోగస్తుల పదోన్నతులు, బదిలీలకు అధికారులు సిఫార్సు చేస్తారు.