శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

06-03-2022 ఆదివారం రాశిఫలాలు - ఆదిత్య హృదయం చదివితే...

మేషం :- దైవ, శుభ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఏ క్షణమైనా విపత్కర పరిస్థితులు ఎదురయ్యే సూచనలున్నాయి. ప్రేమికులకు పెద్దల నుంచి వ్యతిరేకత, ఇతరత్రా చికాకులు అధికం. వ్యాపారాలల్లో పోటీ, ఆటంకాలను ధీటుగా ఎదుర్కుంటారు. అందరూ అయిన వారే అనుకుని మోసపోయే ఆస్కారం ఉంది.
 
వృషభం :- నిరుద్యోగులు నిరుత్సాహం వీడి ఇంటర్వ్యూలకు హాజరుకావటం మంచిది. వృత్తి వ్యాపారాల్లో మెరుగైన పురోభివృద్ధి సాధిస్తారు. విద్యార్థుల్లో ఆందోళన తొలగి నిశ్చింతకు లోనవుతారు. ప్రముఖుల సహకారంతో ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. స్త్రీలకు శుభకార్యాల్లో ప్రత్యేకాదరణ లభిస్తుంది.
 
మిథునం :- వృత్తి వ్యాపారాల్లో మెరుగైన పురోభివృద్ధి సాధిస్తారు. ఒక ఆహ్వానం మిమ్ములను ఇబ్బందికి గురిచేస్తుంది. నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. వాహనం మరమ్మతులకు గురవుతుంది. మీ సంతానం కోసం ధనం వ్యయం చేస్తారు. మీ ప్రత్యర్థులను తక్కువ అంచనా వేయటం మంచిది కాదు.
 
కర్కాటకం :- ప్రతిఫలాపేక్ష లేకుండా మీరు చేసిన సహాయానికి ప్రశంసలు పొందుతారు. కొత్త పరిచయాలు మీ పురోభివృద్ధికి నాంది పలుకుతాయి. ఒక స్థిరాస్తి కొనుగోలు దిశగా మీ ఆలోచనలుంటాయి. లీజు, ఏజెన్సీలు, నూతన టెండర్లు అనుకూలిస్తాయి. వాహనం నిదానంగా నడపటం అన్ని విధాల క్షేమదాయకం.
 
సింహం :- మీ జీవితభాగస్వామితో పట్టింపులు, కలహాలు తప్పవు. స్త్రీలకు అయిన వారి నుంచి వస్త్ర, వస్తు, ధనలాభం వంటి శుభ ఫలితాలున్నాయి. క్రయవిక్రయాలు ఊపందుకుంటాయి. మీ సంతానం పై చదువుల కోసం భవిష్యత్ ప్రణాళికలు రూపొందిస్తారు. మీ బాధ్యతలు ఇతరులకు అప్పగించటం మంచిదికాదు.
 
కన్య :- విద్యార్థులకు ప్రేమ వ్యవహారాలు నిరుత్సాహం కలిగిస్తాయి. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే కోరిక బలీయమవుతుంది. గృహ నిర్మాణాలు, పరిశ్రమలకు కావలసిన అనుమతులు మంజూరవుతాయి. పెట్టిపోతలు, ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు సానుకూలమవుతాయి. మీ శ్రమకు తగిన గుర్తింపు, ప్రతిఫలం పొందుతారు.
 
తుల :- ఆర్థికంగా ఫర్వాలేదు, అయితే మీకు తెలియకుండానే దుబారా ఖర్చులవుతాయి. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాల్లో ఎదురైన పోటీని తట్టుకోవటానికి ఆకర్షణీయమైన పథకాలు అమలుచేయండి. విద్యార్ధులు భయాందోళనలు వీడి శ్రమించిన పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించగలరు. 
 
వృశ్చికం :- రావలసిన ధనం అందటంతో పొదుపు పథకాల దిశగా ఆలోచనలు సాగిస్తారు. స్త్రీల కోరికలు, అవసరాలు నెరవేరగలవు. పత్రికా సంస్థలలోని వారు చిన్న తప్పిదం వల్ల మాటపడక తప్పదు. కొంతమంది మిమ్ములను ఇరకాటానికి గురిచేసేందుకు యత్నిస్తారు. కీలకమైన వ్యవహారాల్లో అనుభవజ్ఞుల సలహా పాటించండి.
 
ధనస్సు :- ఆస్తి వ్యవహారాలకు సంబంధించిన చర్చలు వాయిదా పడతాయి. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనల పట్ల అప్రమత్తత అవసరం. మీ మాటకు ఇంటా బయటా మంచి స్పందన లభిస్తుంది. స్త్రీలు తమ వాక్చాతుర్యంతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. అదనపు బాధ్యతలు, రుణ సమస్యల నుంచి విముక్తులవుతారు.
 
మకరం :- ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన తెలివితో పరిష్కరిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఆశాజనకమైన మార్పులుంటాయి. ఆకస్మికంగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. చేపట్టిన పనులలో స్వల్ప ఆటుపోట్లు ఎదుర్కుంటారు. మీకెదురైన అనుభవంతో మనస్సు మార్చుకుంటారు. స్త్రీలకు ఆరోగ్యంలో సంతృప్తి కానరాదు.
 
కుంభం :- ఆలయాలను సందర్శిస్తారు. ప్రతిఫలాపేక్ష లేకుండా మీరు చేసిన సహాయానికి ప్రశంసలు పొందుతారు. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆకస్మిక ఖర్పులు, పెరిగిన ధరలు ఆందోళన కలిగిస్తాయి. అనవసర విషయాల్లో ఆధిక్యతను ప్రదర్శించి భంగపాటుకు గురవుతారు. విద్యార్థులు మానసికంగా కుదుటపడతారు. 
 
మీనం :- నిర్మాణ పనులలో స్వయం వీక్షణ చాలా అవసరం. కళా, క్రీడారంగాల్లో వారికి పురోభివృద్ధి కానవస్తుంది. పెద్దల ఆరోగ్యము గురించి ఆందోళన చెందుతారు. మీ ఆలోచనాధోరణి కుటుంబ సమస్యలకు చికాకు కలిగిస్తుంది. ఖర్చుల విషయంలో ఏకాగ్రత వహించండి. దూరప్రయాణాలు వాయిదా పడటం మంచిది.