మేషం :- వైద్యులకు శస్త్ర చికిత్సల సమయంలో ఓర్పు, ఏకాగ్రత ఎంతో ముఖ్యం. ఇతరులకు మేలు చేసినా విమర్శలు తప్పవు. మీ శ్రమకు లభించిన ప్రతిఫలంతో సంతృప్తి చెందాల్సి ఉంటుంది. ఉద్యోగస్తులు పై అధికారులతో మితంగా సంభాషించటం క్షేమదాయకం. రాజీ మార్గంతో సమస్యలు పరిష్కరించుకోవాలి. వృషభం :- బంధు మిత్రుల వైఖరిలో మార్పు సంతోషం కలిగిస్తుంది. ఉమ్మడి, ఆర్థిక వ్యవహారాల్లో ఒక నిర్ణయానికి వస్తారు. ఇచ్చిపుచ్చుకునే వ్యవహరాలు, వాణిజ్య...