సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

28-05-2022 శనివారం రాశిఫలాలు - శ్రీమన్నారాయణస్వామిని తులసీదళాలతో..

Rishabham
మేషం :- అధిక ఆదాయం కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలలో ఆటంకాలు అధికంగమించి అనుభవం గడిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులు చేపడతారు. హోటల్, తినుబండ రంగాల్లో వారికి కలిసివచ్చును. స్త్రీల అభిప్రాయాలకు మంచి స్పందన లభిస్తుంది.
 
వృషభం :- విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. స్త్రీలతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. ప్రింటింగ్, స్టేషనరీ రంగంలోని వారికి పనిభారం పెరుగుతుంది. రుణబాధలు, ఒత్తిడులు, మానసిక ఆందోళన ఉంటాయి. గృహ మరమ్మతులు, నిర్మాణాలు చేపడతారు.
 
మిథునం :- చేతివృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. దైవ, సేవా కార్యాల్లో మీ సేవలకు గుర్తింపు లభిస్తుంది. వాహనం నడుపునపుడు మెళుకువ అవసరం. క్రయ విక్రయాలు సామాన్యం. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి పురోభివృద్ధి. ఉత్తర ప్రత్యుత్తరాలు, సంప్రదింపులు సజావుగా సాగుతాయి.
 
కర్కాటకం :- వృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. తల పెట్టిన పనులు అశించినంత చురుకుగా సాగవు. మీ బలహీనతలు, అలవాట్లు అదుపులో ఉంచుకోవడం మంచిది. నూతన రుణాల కోసం అన్వేషిస్తారు. బ్యాంకింగ్ వ్యవహారాలు వాయిదా పడతాయి. రియల్ ఎస్టేట్, స్పెక్యులేషన్ రంగాల వారికి సామాన్యం.
 
సింహం :- ఆర్థిక విషయాల్లో ఆచి, తూచి వ్యవహరించటం మంచిది. నూతన పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. పోస్టల్, కొరియర్ రంగాల వారికి పనిభారం అధికమవుతుంది. శ్రీవారు శ్రీమతి ఆర్యోగం పట్ల శ్రద్ధ చూపిస్తారు. బంధు మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగస్తులకు పనిలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు.
 
కన్య :- వ్యాపారాభివృద్ధికి మరింతగా శ్రమాంచాల్సి ఉంటుంది. ఎలక్ట్రానికల్, ఇన్వెస్టర్ వ్యాపారస్తులకు పురోభివృద్ధి, నిరుద్యోగులకు సదావకాశాలు చేజారిపోతాయి. ఆత్మీయుల కలయిక కొత్త ఉత్సాహం కలిగిస్తుంది. మీ సంతానం ఆరోగ్య విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. విలాసాల కోసం ధన వ్యయం చేస్తారు.
 
తుల :- ఉమ్మడి ఆర్థిక వ్యవహారాల్లో మాటపడాల్సి వస్తుంది. గృహోపకరణాలకు సంబంధించి వస్తువులను కొనుగోలు చేస్తారు. వాతావరణంలో మార్పు వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ఊహించని ఖర్చుల వల్ల చేబదుళ్ళు తప్పవు. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది.
 
వృశ్చికం :- స్థిరాస్తి అమ్మకానికై చేయుప్రయత్నాలు వాయిదా పడతాయి. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. ఇతరులకు ధనం ఇవ్వడం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ ఆలోచనలు, పథకాలు క్రియారూపంలో పెట్టి జయం పొందండి. పెద్దలు ఆరోగ్యపరమైన సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.
 
ధనస్సు :- అప్రయత్నంగా కొన్ని వ్యవహారాలు అనుకూలిస్తాయి. వైద్యులకు ఓర్పు, ఏకాగ్రత ఎంతో ముఖ్యం. ప్రేమికుల మధ్య కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. విదేశీయ వస్తువులు పట్ల ఆకర్షితులవుతారు. వాహనం కొనుగోలుకై చేయుయత్నాలు అనుకూలిస్తాయి. స్టేషనరీ, ఫ్యాన్సీ, సుగంధ ద్రవ్య వ్యాపారులకు కలిసివచ్చేకాలం.
 
మకరం :- ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన మిత్రుల సహకారం వల్ల సమసిపోగలవు. స్త్రీల మనోభావాలకు, తెలివితేటలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఉత్తరప్రత్యుత్తరాలు, బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెలకువ వహించండి. విద్యార్థులకు మిత్ర బృందాల వల్ల సమస్యలు తలెత్తుతాయి. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది.
 
కుంభం :- ఉద్యోగస్తులకు సహోద్యోగులతో అప్రమత్త అవసరం. కార్మికులకు, తాపీ పనివారికి సంతృప్తి కానరాదు. మీ కళత్ర వైఖరి మీకు చికాకు కలిగించగలదు. బంధువులు, సోదరుల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు విషయంలో పునరాలోచన అవసరం.
 
మీనం :- స్త్రీలు టి.వి., ఛానల్స్ కార్యక్రమాలలో రాణిస్తారు. బంధువుల రాకతో ఖర్చులు అదుపు చేయాలనే మీ ఆలోచన ఫలించదు. ఓర్పు, శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. బ్యాంకింగ్ వ్యవహారాలలో ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. వైద్య శిబిరంలోని వారు తరచు ఒత్తిడులకు గురవుతారు.