సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

27-05-22 శుక్రవారం రాశిఫలాలు ... పార్వతిదేవిని పూజించిన మనోవాంఛలు...

tula rashi
మేషం :- ఆర్థికలావాదేవీలు, కీలకమైన సమస్యలు సమర్థవంతంగా పరిష్కరిస్తారు. మీ పట్టుదల, అంకితభావం ఇతరులకు మార్గదర్శకమవుతుంది. ఎదుటివారి తీరును గమనించి దానికి తగినట్లుగా మెలగండి. శాస్త్ర, సాంకేతిక, కళ, క్రీడా రంగాల వారికి ఆశాజనకం. మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి, త్రిప్పట తప్పవు.
 
వృషభం :- సినిమా రంగాలలో వారికి చికాకులు తప్పవు. ప్రయాణాల్లోను, బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెలకువ వహించండి. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. రుణదాతల నుండి ఒత్తిడి అధికమువుతుంది. నిరుద్యోగులు తొందరపాటు తనంవల్ల సదావకాశాలు జారవిడుచుకుంటారు.
 
మిథునం :- ఏ.సి. కూలర్లు మెకానికల్ రంగాలలో వారికి సంతృప్తి కానవచ్చును. ఏదైనా స్థిరాస్తి కొనుగోలు, అమ్మకం దిశగా మీ ఆలోచనలుంటాయి. మీ చిన్నారుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. ఆత్మీయులతో కలసి విహార యాత్రలలో పాల్గొంటారు.
 
కర్కాటకం :- మిత్రుల తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. రాజకీయాల్లో వారికి సదావకావకాశాలు లభిస్తాయి. ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి పురోభివృద్ధి. బ్యాంకింగ్ వ్యవహారాలలో పనులు మందకొడిగా సాగుతాయి. కుటుంబ సమేతంగా పుణ్యక్షేత్ర సందర్శనలు పాల్గొంటారు. దూర ప్రయాణాలలో అసౌకర్యానికి గురవుతారు.
 
సింహం :- స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, ప్రోత్సాహం లభిస్తాయి. గృహ వాస్తు దోష నివారణ వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. ఏదైనా అమ్మకానికి చేయు ప్రయత్నాలు వాయిదా పడుట మంచిది. దంపతుల మధ్య నూతనోత్సాహం చోటుచేసుకుంటుంది. దైవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని అందరినీ ఆకట్టుకుంటారు.
 
కన్య :- బ్యాంకు రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికం. మీ చిన్నారులకు అవసరమైన వస్తువులు సేకరిస్తారు. కుటుంబీకుల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయి. మీ సంతానం కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. ఖర్చులు అధికమవుతాయి.
 
తుల :- కొబ్బరి, పండ్లు, చల్లని పానీయ వ్యాపారస్తులకు కలసివచ్చేకాలం. ప్రేమికులకు ఎడబాటు, చికాకులు తప్పవు. పారిశ్రామిక రంగాల వారికి అన్ని విధాలా ప్రోత్సాహకరం. పొదుపు దిశగా మీ ఆలోచనలు ఉంటాయి. విద్యా సంస్థలలోని వారికి ఒత్తిడి, పెరుగుతుంది. మితిమీరిన శరీర శ్రమ, అంకాలు భోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది.
 
వృశ్చికం :- ప్రముఖుల ప్రమేయంతో మీ సమస్య సానుకూలమవుతుంది. రావలసిన బకాయిలు సకాలంలో అందుట వల్ల ఆర్థిక ఇబ్బంది అంటూ ఉండదు. ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తత అవసరం. గతంలో నిలిపి వేసిన వ్యాపారాలు, పనులు పునఃప్రారంభించటానికి చేసే యత్నాలు ఫలిస్తాయి.
 
ధనస్సు :- ద్విచక్ర వాహనాలపై దూర ప్రయాణాలు క్షేమం కాదని గమనించండి. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోవటం ఎంతైనా అవసరం. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి అధిక పర్యటనల వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. సిమెంటు, కలప, ఇరన్, ఇటుక వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది.
 
మకరం :- ఆదాయం పెంచుకునేందుకు చేసే యత్నాల్లో సఫలీకృతులవుతారు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శించుకుంటారు. అనుకోకుండా ఒక చిన్నారితో విడదీయరాని బంధం ఏర్పడుతుంది. మీరు చేసిన వ్యాఖ్యలు కొంతమందికి ఇబ్బందికరంగా ఉంటాయి. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలిస్తాయి.
 
కుంభం :- స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రేమికులు పెద్దలతో ఏకీభవించలేకపోతారు. మీ మాటకు కుటుంబంలో గౌరవం లభిస్తుంది. బంధు మిత్రులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ విభాగం నుంచి ఒత్తిడి పెరుగుతుంది. సోదరీ సోదరుల నుంచి చికాకులు తప్పవు.
 
మీనం :- కొబ్బరి, పండ్ల, పూల, పానీయ వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. శత్రువులు మిత్రులుగా మారి సహాయం అందిస్తారు. రావలసిన ధనం అందటంతో తనఖా పెట్టిన వస్తువులు విడిపించుకుంటారు. సమయానికి సహకరించని మిత్రుల వల్ల ఒకింత ఇబ్బందు లెదుర్కుంటారు. నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లకు లౌక్యం అవసరం.