సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

22-05-22 ఆదివారం రాశిఫలాలు ... లలిత సహస్రనామం చదివినా లేక విన్నా శుభం..

Rishabham
మేషం :- కొబ్బరి, పండ్లు, హోటల్, చల్లని పానియ, తినుబండారు వ్యాపారులకు లాభం. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులకు గురికాకండి. ఖర్చుకు వెనకాడకుండా విలువైన వస్తువులు సేకరిస్తారు. కుటుంబీకుల మధ్య అనురాగవాత్సల్యాలు పెంపొందుతాయి. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది.
 
వృషభం :- సన్నిహితులతో కలిసి విందుల్లో పాల్గొంటారు. పత్రికా రంగంలోని వారికి రచయితలకు అనువైన సమయం. వ్యాపారాల్లో కొత్త కొత్త మెళకువలు గ్రహిస్తారు. గృహిణులకు పనివాలతో సమస్యలు తలెత్తుతాయి. అదనపు ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది.
 
మిథునం :- విందులలో పరిమితి పాటించండి. ఆధ్యాత్మిక, ఆరోగ్య విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ సంతానంతో ఉల్లాసంగా గడుపుతారు. విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. రుణాలు, పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తారు. సిమెంటు, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు ఆశాజనకం. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు.
 
కర్కాటకం :- నిర్మాణ పనులలో కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు ఒత్తిడి పెరుగుతుంది. ఆత్మీయులతో కలసి విహార యాత్రలలో పాల్గొంటారు. ప్రముఖుల కలయిక సాధ్యపడుతుంది. గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన అవసరం. దైవ, సేవా, సాంఘిక కార్యక్రమాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు.
 
సింహం :- విందు, వినోదాల కోసం అధికంగా ధనం వ్యయం చేస్తారు. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయుయత్నాలు ఫలిస్తాయి. ఒక కార్యం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. ఏదైనా అమ్మకానికి చేయుప్రయత్నాలు వాయిదా పడుటమంచిది. దంపతుల మధ్య అభిప్రాయబేధాలు చోటుచేసుకుంటాయి.
 
కన్య :- స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, ప్రోత్సాహం లభిస్తాయి. కుటుంబంలో శుభ కార్యాలకై చేయుయత్నాలు ఫలిస్తాయి. రావలసిన ధనం అందటంతో పొదుపు దిశగా మీ ఆలోచన లుంటాయి. సొంతంగా వ్యాపారం చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. ప్రయాణాలు అనుకూలం. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు.
 
తుల :- పెద్దల ఆరోగ్యంలో ఆందోళన అధికమవుతుంది. కుటుంబీకులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. స్త్రీలు విందులు, వినోదాలలో పలువురిని ఆకట్టుకుంటారు. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో పునరాలోచన అవసరం. కళలు, క్రీడలపట్ల ఆసక్తి పెరుగుతుంది. కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల విషయంలో లౌక్యం అవసరం.
 
వృశ్చికం :- ఆర్థిక విషయాల్లో ఒకడుగు ముందుకు వేస్తారు. స్త్రీలు భేషజాలకు పోకుండా లౌక్యంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఆస్తి వ్యవహారాల్లో సోదరీ, సోదరుల వైఖరి ఆందోళన కలిగిస్తుంది. అకాల భోజనం, శ్రమాధిక్యతల వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. విద్యుత్, ఎలక్ట్రానికల్, ఇన్వెర్టర్ వ్యాపారస్తులకు పురోభివృద్ధి.
 
ధనస్సు :- గృహ మరమ్మతులు, మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. పాత మిత్రుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. ప్రముఖుల కలయికతో మీ సమస్య ఒకటి సానుకూలమవుతుంది. పుణ్యక్షేత్రాలు, నూతన ప్రదేశ సందర్శనల పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లో అప్రమత్తత అవసరం.
 
మకరం :- చేతివృత్తుల వారికి అవకాశాలు లభించినా ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. రాజకీయ నాయకులు సభలు, సమావేశాల కోసం ప్రయాణాలు చేయవలసి వస్తుంది. మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయా లేర్పడతాయి. తెలివి తేటలతో వ్యవహరించడం వల్ల కొన్ని వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి.
 
కుంభం :- వ్యాపారాభివృద్ధికి కావలసిన ప్రణాళికలు అమలుచేస్తారు. నిర్మాణ పనులలో నాణ్యత లోపంవల్ల బిల్డర్లు కష్టనష్టాలను ఎదుర్కొంటారు. బంధు మిత్రులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. స్త్రీలు టి.వి., ఛానల్స్ కార్య క్రమాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. జాగ్రత్త వహించండి. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులు తప్పవు.
 
మీనం :- శత్రువులు మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. కొబ్బరి, పండ్ల, పూల,పానీయ, చిరు వ్యాపారులకు లాభదాయకం. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు క్షేమదాయకం కాదు. ప్రేమ వ్యవహారాల్లో తొందరపాటు తనం కూడదు. స్త్రీలకు ఉదరం, మోకాళ్లు, నరాలకు సంబంధించిన చికాకులు అధికం.