మంగళవారం, 7 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

17-05-22 మంగళవారం రాశిఫలాలు ... మహాలక్ష్మీని ఎర్రని పూలతో పూజించిన...

astro11
మేషం :- ప్రైవేటు సంస్థల్లోని ఉద్యోగస్తులకు తోటివారి కారణంగా చికాకులు తప్పవు. ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఎదుటివారి తీరును గమనించి వ్యవహరించండి. కొబ్బరి, పండ్ల, పూల, పానీయ వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత అవసరం.
 
వృషభం :- లౌక్యంగా వ్యవహరించి ఒక అవకాశాన్ని మీకు అనుకూలంగా మలుచుకుంటారు. శ్రమాధిక్యత, ఒత్తిడి వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. కార్యసాధనలో జయం, కుటుం సౌఖ్యం వంటి శుభపరిణామాలుంటాయి. ఆస్తి వ్యవహరాలకు సంబంధించి కుటుంబీకుల మధ్య విభేదాలు తప్పవు. చేతివృత్తులు, చిరు వ్యాపారులకు సామాన్యం.
 
మిథునం :- ఆదాయం పరిమితంగా ఉన్నా ఆర్థిక ఇబ్బందు లుండవు. అనుకున్న పనులు ఒకంతట పూర్తి కావు. మీ సంతానం భవిష్యత్తు కోసం కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. తరచు సభ, సమావేశాలలో పాల్గొంటారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. విద్యార్థులు క్రీడా కార్యక్రమాలలో పాల్గొంటారు.
 
కర్కాటకం :- పారిశ్రామిక రంగాల వారికి అన్ని విధాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు చేపట్టే ఆస్కారం ఉంది, నిరుద్యోగ యత్నాలు ఫలిస్తాయి. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి కె.తిడి, పనిభారం అధికం ప్రీలకు పనివారలతో చికాకులు తప్పవు. పెద్దలు గురించి ఆందోళన చెందుతారు.
 
సింహం :- రహస్య విరోధులు అధికం కావడంవల్ల రాజకీయాల్లో వారికి ఆందోళన తప్పదు. మీ అభిరుచులకు తగిన విధంగా బంధువులు మసలుకుంటారు. రుణం తీర్చి తాకట్టు వస్తువులు విడిపించుకుంటారు. పెద్దల ఆశీస్సులు, ప్రముఖుల ప్రశంసలు పొందుతారు. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి.
 
కన్య :- బంధు మిత్రుల రాకపోకలు అధికమవుతాయి. రుణయత్నాల్లో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. మీ సంతానం ఉన్నత విద్యల విషయమై ఒక నిర్ణయానికి వస్తారు. ధనం విరివిగా వ్యయం చేయాల్సి వస్తుంది. స్త్రీలకు అపరిచిత వ్యక్తుల వల్ల ఇక్కట్లు ఎదురవుతాయి. ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాల్లో స్వల్ప మార్పులుంటాయి.
 
తుల :- ఏజెంట్లకు, బ్రోకర్లకు శ్రమాధిక్యత మినహా ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి పురోభివృద్ధి. వ్యవసాయ, తోటల రంగాల వారికి ఆందోళన తప్పదు. చిన్నతరహా పరిశ్రమల వారికి సంతృప్తి, పురోభివృద్ధి. సన్నిహితులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు.
 
వృశ్చికం :- భాగస్వామిక చర్చలు అర్ధాంతంగా ముగించాల్సివస్తుంది. కుటుంబీకుల వైఖరి ఆందోళన కలిగిస్తుంది. ఖర్చులు అదుపు చేయాలన్న మీ యత్నం నెరవేరదు. చేపట్టిన పనులు ఓర్పు, పట్టుదలో శ్రమించి సకాలంలో పూర్తి చేస్తారు. సన్నిహితుల నుంచి అందిన ఒక సమాచారం మిమ్ములను సందిగ్ధంలో పడవేస్తుంది.
 
ధనస్సు :- విదేశీయానం కోసం చేసే యత్నాల్లో సఫలీకృతులవుతారు. మొక్కుబడులు తీర్చుకోవాలనే మీ సంకల్పం నెరవేరుతుంది. ఎదుటివారితో ఆచితూచి సంభాషించండి. రిప్రజెంటేటివ్‌లకు ఒత్తిడి పెరుగుతుంది. అకాల భోజనం, శ్రమాధిక్యతల వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ప్రేమికులకు నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి.
 
మకరం :- కుటుంబ సౌఖ్యం, వాహనయోగం పొందుతారు. మీ యత్నాలకు సన్నిహితులు సహాయ సహకారాలు అందిస్తారు. నిరుద్యోగులకు ఆశాజనకం. స్త్రీలకు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యవసాయ రంగాల వారికి సంతృప్తి, పురోభివృద్ధి.
 
కుంభం :- దైవ, సేవా కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. స్త్రీలకు చుట్టుపక్కల వారితో సత్సంబంధాలు నెలకొంటాయి. వాహన చోదకులు చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. బంధుమిత్రుల నుంచి ఒత్తిడి, మొహమాటాలు ఎదుర్కుంటారు. ప్రయాణాలు, నూతన ప్రదేశ సందర్శనలు ఉల్లాసాన్నిస్తాయి. ప్రేమికుల మధ్య ఎడబాటు తప్పదు.
 
మీనం :- కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారులకు పురోభివృద్ధి. వృత్తుల వారికి అన్ని విధాలా కలిసిరాగలదు. సన్నిహితులో ఉల్లాసంగా గడుపుతారు. ప్రత్యర్థుల తీరు ఆందోళన కలిగిస్తుంది. ప్రేమికులు అతిగా వ్యవహరించటం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. విలువైన పత్రాలు, రశీదులు అందుకుంటారు.