శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

15-05-22 ఆదివారం రాశిఫలాలు ... మీ ఇష్టదైవాన్ని పూజించిన శుభం...

astro8
మేషం :- సన్నిహితుల సలహాలు, హితోక్తులు మీ పై మంచి ప్రభావం చూపుతాయి. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వటం మంచిది కాదని గమనించండి. రావలసిన ధనంలో కొంత భాగం వసూలు కాగలదు. ఖర్చులు విషయంలో ఆచితూచి వ్యవహరించండి. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు.
 
వృషభం :- కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించండి. అవసరానికి సహకరించని మిత్రుల తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. మీ సంతానం విద్యా, ఆరోగ్య విషయాల పట్ల ప్రత్యేకశ్రద్ధ కనబరుస్తారు. గత అనుభవాలు మీ లక్ష్యసాధనకు ఉపకరిస్తాయి. సన్నిహితులతో కలిసి చేపట్టిన పనులు సమీక్షిస్తారు.
 
మిథునం :- కార్యసాధనలో అనుకూలత, కుటుంబ సౌఖ్యం పొందుతారు. లీజు, ఏజెన్సీలు, నూతన కాంట్రాక్టులు అనుకూలిస్తాయి. దైవ, ఆరోగ్య విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్త్రీలకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి. క్రయ విక్రయాలు సామాన్యం. స్థిరచరాస్తుల క్రయ విక్రయాల్లో పునరాలోచన మంచిది. 
 
కర్కాటకం :- ప్రతి విషయంలోను బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. ఉన్నతస్థాయి అధికారులు ఒత్తిడి, ప్రలోభాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. శస్త్రచికిత్సల సమయంలో వైద్యులకు ఏకాగ్రత ముఖ్యం. స్త్రీల అభిప్రాయాలకు మిశ్రమ స్పందన లభిస్తుంది. ఎంత శ్రమించినా సామాన్య ఫలితాలే పొందుతారు.
 
సింహం :- ఉద్యోగస్తులకు రావలసిన ప్రమోషన్, ట్రాన్స్‌ఫర్లకు కొంతమంది అవరోధం కల్పిస్తారు. చేపట్టిన పనులు ఒకంతట పూర్తికావు. ఆకస్మిక ఖర్చులు, తప్పనిసరి చెల్లింపులు ఇబ్బంది కలిగిస్తాయి. స్త్రీలు భేషజాలకు పోకుండా లౌక్యంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రముఖుల కలయికతో మీ సమస్య పరిష్కారం కాగలదు.
 
కన్య :- కుటుంబ సౌఖ్యం, వాహన యోగం పొందుతారు. విదేశీయాన యత్నాలు ఫలిస్తాయి. రియల్ స్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లలో ప్రతికూలతలు ఎదుర్కోవలసి వస్తుంది. సంకల్ప బలంతో కొన్ని లక్ష్యాలు సాధిస్తారు. ప్రతి విషయంలోను ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది. ఖర్చులు పెరిగినా ప్రయోజనకరంగా ఉంటాయి.
 
తుల :- ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. విందుల్లో పాల్గొంటారు. వస్త్ర, ఫ్యాన్సీ, గృహోపకరణ వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. వాహనం నడుపుతున్నపుడు మెలకువ వహించండి. స్త్రీలకు అయినవారి నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. వైద్య, ఇంజనీరింగ్, శాస్త్ర, సాంకేతిక రంగాల వారికి కలిసిరాగలదు.
 
వృశ్చికం :- ఉద్యోగస్తులకు రావలసిన ప్రమోషన్‌లో జాప్యం తప్పదు. తరుచు సభలు, దైవకార్యాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు చికాకు పరుస్తాయి. ఖాదీ, చేనేత, నూలు వస్త్ర వ్యాపారులకు పురోభివృద్ధి. నూతన టెండర్లు చేజిక్కించుకుంటారు. విద్యార్థులకు శుభవార్తా శ్రవణం. ప్రేమికుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి.
 
ధనస్సు :- ప్రేమికులు అతిగా వ్యవహరించి చిక్కుల్లో పడతారు. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత ముఖ్యం. వృత్తుల వారికి ఆశించినంత పురోభివృద్ధి. వ్యాపారాభివృద్ధికి చేయు కృషిలో సఫలీకృతులవుతారు. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా మెలగండి. పాత మిత్రుల కలయిక ఉత్సాహం కలిగిస్తుంది.
 
మకరం :- ఉద్యోగస్తుల శక్తిసామర్థ్యాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఖర్చులు, చెల్లింపులలో ఏకాగ్రత అవసరం. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కొబ్బరి, పండ్ల, కూరగాయల వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. వృత్తుల వారు ఎంత శ్రమించినా ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. షేర్ల క్రయ విక్రయాల్లో పునరాలోచన అవసరం.
 
కుంభం :- వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన మార్పులు లేకపోవటంతో ఒకింత నిరుత్సాహానికి లోనవుతారు. స్త్రీలకు నడుము, నరాలు, ఎముకలకు సంబంధించిన చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాల్లో క్రమేణా నిలదొక్కుకుంటారు.
 
మీనం :- మీ సంతానం ఉన్నత విద్యల గురించి ఒక నిర్ణయానికి వస్తారు. చేపట్టిన పనులు అల్లంతంగా ముగించాల్సి వస్తుంది. స్త్రీలకు బంధువర్గాలతో పట్టింపులు, చికాకులు అధికమవుతాయి. భాగస్వామిక వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు సమర్థంగా నిర్వహిస్తారు. ప్రతి విషయంలోను స్వయంకృషిపైనే ఆధారపడటం మంచిది.