బుధవారం, 8 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

16-05-22 సోమవారం రాశిఫలాలు ... శంకరుడిని పూజించినా మీ సంకల్పం...

astro10
మేషం :- ప్రముఖుల సహకారంతో ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. స్టాక్ మార్కెట్ రంగాల వారికి సామాన్యం. కీలకమైన విషయాలు మీ జీవిత భాగస్వామికి తెలియచేయటం మంచిదని గమనించండి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఆశాజనకం. రుణం ఏ కొంతైనా తీర్చాలన్న మీ యత్నం ఫలిస్తుంది.
 
వృషభం :- శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి వల్ల అస్వస్థతకు గురవుతారు. తరుచు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ఓర్పు, సంయమనంతో వ్యవహరించాల్సి ఉంటుంది. ఖర్చులు ప్రయోజనకరంగా ఉంటాయి. వాణిజ్య ఒప్పందాలు, రిజిస్ట్రేషన్లు వాయిదా పడటం మంచిది. దూర ప్రయాణాలలో అంటకాలను ఎదుర్కొంటారు.
 
మిథునం :- స్త్రీలు విలువైన వస్తువులు అమర్చుకుంటారు. ప్రముఖుల కలయిక సాధ్యం కాదు. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి శ్రమించిన సదావకాశాలు లభిస్తాయి. పత్రికా రంగంలో పనిచేసే సిబ్బందికి ఊహించని చికాకులు ఎదురవుతాయి. నిత్యావసరవస్తు స్టాకిస్టులు, వ్యాపారులకు అధికారుల నుంచి వేధింపులు తప్పవు.
 
కర్కాటకం :- ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. దైవ, సేవా, పుణ్యకార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఎదుటివారి విషయాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళనలు అధికమవుతాయి. స్త్రీలు బంధువర్గాల నుంచి కొత్త విషయాలు గ్రహిస్తారు.
 
సింహం :- మిత్రుల ప్రోత్సాహంతో కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. ప్రేమ వ్యవహరాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి వేధింపులు, చికాకులను ఎదుర్కొంటారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి పురోభివృద్ధి. వృత్తుల వారికి శ్రమకు తగిన ప్రతిఫలం లభించకపోవచ్చు.
 
కన్య :- భాగస్వామిక చర్చలు అర్థాంతంగా ముగుస్తాయి. స్త్రీలతో మితంగా సంభాషించటం క్షేమదాయకం. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. కొత్త వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. తల పెట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఆకస్మిక ఖర్చుల వల్ల ధనం చేతిలో నిలబడటం కష్టం. ఆపత్సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు.
 
తుల :- శ్రమాధిక్యతతో కొన్ని లక్ష్యాలు సాధిస్తారు. నిరుద్యోగులు చేపట్టిన ఉపాథి పథకాలు సంతృప్తినిస్తాయి. సంఘంలో మీ మాటకు మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి వేధింపులు, చికాకులు తప్పవు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి.
 
వృశ్చికం :- ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటారు. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల అవసరం. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. బంధువుల రాక పోకలు అధికమవుతాయి. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో ఒత్తిడి, చికాకు కలిగిస్తుంది. దూర ప్రయాణాలలో వస్తువులపట్ల జాగ్రత్త అవసరం.
 
ధనస్సు :- వృత్తుల వారికి శ్రమకు తగిన ప్రతిఫలం లభించకపోవచ్చు. మిత్రుల ప్రోత్సాహంతో కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. దూర ప్రయాణాలు, తీర్థయాత్రలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. మీ సంతానం కోసం ధనం అధికంగా వెచ్చిస్తారు. నూతన పరిచయాలు అధికమవుతాయి.
 
మకరం :- ఆత్మీయుల గురించి ఆందోళన చెందుతారు. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. సభలు, సమావేశాల్లో అందరినీ ఆకట్టుకుంటారు. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. ప్రేమికుల విపరీత ధోరణి అనర్ధాలకు దారితీస్తుంది. మీ అభిప్రాయాలను కుటుంబీకులు వ్యతిరేకిస్తారు.
 
కుంభం :- గృహ మరమ్మతులు, నిర్మాణాలు చేపడతారు. నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి, పనిభారం తప్పవు. పాత మిత్రుల కలయికతో గత అనుభవాలుజ్ఞప్తికి వస్తాయి. అపరాలు, ధాన్యం, వాణిజ్య వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. స్త్రీలు అశాంతి, అసంతృప్తికి లోనవుతారు.
 
మీనం :- మీ మాటకు కుటుంబంలోను, గౌరవం లభిస్తుంది. పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. శారీరక శ్రమ, ఒత్తిడి వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ఉపాధ్యాయులకు, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ప్రముఖులతో కీలకనమైన వ్యవహారాలు చర్చలు జరుపుతారు. ్