సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్
Last Updated : శుక్రవారం, 20 మే 2022 (07:37 IST)

20-05-2022 - శుక్రవారం మీ రాశి ఫలితాలు.. గౌరిదేవిని ఆరాధిస్తే..?

mangala gowri
మేషం:- ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సమస్యలు సమర్థంగా పరిష్కరిస్తారు. ప్రయాణాల్లో కొంత అసౌకర్యానికి గురవుతారు. స్త్రీలకు ఆరోగ్య విషయంలో అశ్రద్ధ కూడదు. ఒకరికి సలహా ఇచ్చి మరొకరి ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది. మీ సంతానం ఉన్నతి కోసం కొత్త కొత్త పథకాలు, ప్రణాళికులు రూపొందిస్తారు.
 
వృషభం :- కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు చర్మవస్తాయి. దంపతుల మధ్య కొత్త కొత్త విషయాలు చర్చకు వస్తాయి. ఊహించిన ఖర్చులు, సమయానికి ధనం అందకపోవటం వల్ల ఆటుపోట్లు తప్పవు. స్త్రీలకు షాపింగ్ లోను, వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత ముఖ్యం. విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది.
 
మిధునం:- ఒక కార్యం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేస్తారు. స్టాక్ మార్కెట్ రంగాల వారి అంచనాలు ఫలిస్తాయి. ప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెలకువ వహించండి. మీ ఏమరుపాటు వల్ల విలువైన వస్తువులు చేజారిపోతాయి. దైవ కార్యాలకు ఇతోధికంగా సహకరిస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు.
 
కర్కాటకం:- గృహోపకరణాలు అమర్చుకుంటారు. క్రయ విక్రయాలు సంతృప్తికరంగా సాగుతాయి. ప్రముఖుల గురించి ఆశ్చర్యకరమైన వార్తలు వింటారు. ఉద్యోగస్తులు ఒత్తిడి, ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. విద్యార్థుల్లో నూతనోత్సాహం చోటు చేసుకుంటుంది. బంధువులు మీ ఉన్నతిని చూసి అపోహపడే ఆస్కారం ఉంది.
 
సింహం:- నిర్మాణ పనుల్లో నాణ్యత లోపం వల్ల బిల్డర్లకు, కాంట్రాక్టర్లకు ఇబ్బందులు తప్పవు. చేతివృత్తులు, చిన్నతరహా పరిశ్రమల వారికి ఆశాజనకం. ఐరన్, ఇటుక వ్యాపారులకు మిశ్రమ ఫలితం. ఉన్నత చదువులగురించి విద్యార్థులు ఒక నిర్ణయానికి వస్తారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు, శ్రమాధిక్యత ఎదుర్కోవలసి వస్తుంది. 
 
కన్య - వ్యాపారాభివృద్ధికి మరింతగా శ్రమాంచాల్సి ఉంటుంది. ప్రయాణాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. ప్రతి విషయంలోను శాంతియుతంగా వ్యవహరించాలి. గతంలో నిలిపివేసిన పనులు పునఃప్రారంభిస్తారు. ప్రముఖుల కలయికతో ఒక సమస్య మీకు అనుకూలంగా పరిష్కారమవుతుంది.
 
తుల:- కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ విభాగం వారి నుంచి ఒత్తిడి పెరుగుతుంది. వాహనం నడుపుతున్నపుడు మెలకువ వహించండి. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి పనిభారం, విశ్రాంతి లోపం వంటి చికాకులు తప్పవు. గృహ మరమ్మతులు, మార్పులు చేర్పులు అనుకూలిస్తాయి. లౌక్యంగా వ్యవహరించి ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు.
 
వృశ్చికం:- స్థిరాస్తి క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి. నూతన పెట్టుబడులకు మరి కొంత కాలం వేచియుండటం శ్రేయస్కరం. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. సహోద్యోగులతో సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ఆపత్సమయంలో మిత్రులకు అండగా నిలుస్తారు. ముక్కుసూటిగా పోయే మీ తీరు ఇబ్బందులకు దారితీస్తుంది.
 
ధనస్సు: - నిరుద్యోగులు చేపట్టిన ఉపాథి పథకాలకు ప్రోత్సాహం లభిస్తుంది. ఇచ్చిపుచ్చుకునే వ్యవహరాలు, ఒప్పందాల్లో మెలకువ వహించండి. దైవ కార్యాలకు ఇతోధికంగా సహకరిస్తారు. స్త్రీలకు బంధువులు, చుట్టుపక్కల వారి నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు పదోన్నతి, కోరుకున్న చోటికి బదిలీ వంటి శుభవార్తలు అందుతాయి.
 
మకరం:- వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. తరుచు దైవ కార్యాల్లో పాల్గొంటారు. కాంట్రాక్టుల వ్యవహారంలో పునరాలోచన అవసరం. మీ మాటతీరును ఎదుటివారు అపార్థం చేసుకుంటారు. ఎదుటివారికి మీ మాటపై నమ్మకం ఏర్పడుతుంది. చేపట్టిన పనుల్లో ఒత్తిడి, జాప్యం వంటి చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. 
 
కుంభం:- స్త్రీలకు సన్నిహితుల నుంచి ఒక ముఖ్య సమాచారం అందుతుంది. గృహ మరమ్మతులు, మార్పులు చేర్పులు అనుకూలిస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు. అదనపు సంపాదన కోసం యత్నాలు చేస్తారు. దంపతుల మధ్య అనురాగవాత్సల్యాలు పెంపొందుతాయి. మీ విలువైన వస్తువుల విషయంలో మెలకువ వహిచండి.
 
మీనం:- ఆర్ధికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. మీ యత్నాలకు సన్నిహితుల తోడ్పాటు లభిస్తుంది. కొబ్బరి, పండ్ల, పూల, చల్లని పానియ చిరు వ్యాపారులకు కలసివస్తుంది. భాగస్వామిక వ్యాపారాల నుంచి విడిపోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. కొంతమంది మిమ్ములను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు.