గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

23-05-22 సోమవారం రాశిఫలాలు ... వరసిద్ధి వినాయకుడిని గరికెతో..

Mithunam
మేషం :- ఆర్థిక వ్యవహారాలలో ఒక అడుగు ముందుకేస్తారు. సంఘంలో మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. బంధు మిత్రుల రాకపోకలు అధికం. రావాల్సిన మొత్తం వాయిదా పడతాయి. ప్రముఖులను కలుసుకుంటారు. స్త్రీలకు ఇరుగు, పోరుగు వారికి నుంచి విమర్శలు తప్పవు. గృహమునకు వస్తువులు సమకూర్చుతారు. 
 
వృషభం :- రాజకీయ నాయకులు సభ, సమావేశాలలో పాల్గొంటారు. స్త్రీలు షాపింగ్ కోసం ధనం అధికంగా వెచ్చిస్తారు. విజ్ఞతతో మీ ఆత్మాభిమానం కాపాడుకుంటారు. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. నిత్యావసర వస్తు స్టాకిస్టులు, వ్యాపారులకు కలిసిరాగలదు. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.
 
మిథునం :- నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో శ్రద్ధ వహించండి. ప్రముఖుల కలయికతో ఒక సమస్య మీకు అనుకూలంగా పరిష్కారమవుతుంది. ప్రముఖ పుణ్యక్షేత్రం సందర్శనకు సన్నాహాలు సాగిస్తారు. సంకల్ప బలంతో కొన్ని లక్ష్యాలు సాధిస్తారు. ఏజెంట్లకు, రిప్రజెంటేటివ్‌లకు ఒత్తిడి పెరుగుతుంది. మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు.
 
కర్కాటకం :- కుటుంబ, ఆర్థిక సమస్యలు సర్దుకుంటాయి. స్వయంకృషితోనే మీరు రాణిస్తారు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారికి లాభదాయకంగా ఉంటుంది. నిరుద్యోగులు పోటీ పరీక్షలలో సఫలీకృతులౌతారు. దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళుకువ అవసరం. స్త్రీలు షాపింగ్ కోసం ధనం అధికంగా వెచ్చిస్తారు.
 
సింహం :- విదేశాల్లోని అభిమానుల క్షేమ సమాచారం ఆందోళన కలిగిస్తుంది. ప్రేమికులకు పెద్దల నుంచి వ్యతిరేకత, ఆంక్షలు తప్పవు. ఉమ్మడి వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాల్లో మెలకువ వహించండి. స్త్రీలకు నరాలకు, కళ్లు, తల, నరాలకు సంబంధించిన చికాకులను ఎదుర్కొంటారు. ప్రముఖుల కలయిక సాధ్యం కాదు.
 
కన్య :- స్త్రీలకు పనివారితో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. దైవ, సేవాకార్యాల్లో మీ సేవలకు గుర్తింపు లభిస్తుంది. భాగస్వామిక, జాయింట్ వెంచర్లు సంతృప్తినిస్తాయి. నూతన పరిచయాలు మీ పురోభివృద్ధికి తోడ్పడతాయి. దూరప్రయాణాలలో చికాకు తప్పదు. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది.
 
తుల :- వ్యాపారాల్లో నష్టాలు, చికాకులను అధికమిస్తారు. మీ అవసరాలకు కావలసిన ధనం సర్దుబాటు కాగలదు. స్త్రీలపై శకునాలు, ఇతరుల వ్యాఖ్యల ప్రభావం అధికం. కాంట్రాక్టర్లకు ఆర్థిక ఒడిదుడుకులు తప్పవు. సోదరీ సోదరుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. నిరుద్యోగుల ఉపాధి పథకాలకు మంచి స్పందన లభిస్తుంది.
 
వృశ్చికం :- ఆర్థికంగా బాగుగా అభివృద్ధి చెందుతారు. రాజకీయ నాయకులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. బంధు మిత్రుల రాకతో గృహంలో సందడి కావస్తుంది. దూర ప్రయాణాలలో వస్తువులపట్ల మెళుకువ అవసరం. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. విందులు, వినోదాలలో పాల్గొంటారు.
 
ధనస్సు :- ఐరన్, ఆటోమోబైల్, మెకానికల్ రంగాల్లో వారికి లాభదాయకం. ఉద్యోగరీత్యా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఖర్చులు అధికమవుతాయి. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. రాజకీయ నాయకులకు అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం.
 
మకరం :- ఉద్యోగస్తులు ఏమరుపాటు కూడదు. కాంట్రాక్టర్లకు పనివారలతో చికాకులు తప్పవు. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. ప్రముఖులను కలుసుకుంటారు. వ్యాపారాభివృద్ధికి నూతన పథకాలు చేపడతారు. బంధువుల రాక స్త్రీలలో ఉత్సాహం చోటుచేసుకుంటుంది. ఆకస్మికంగా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది.
 
కుంభం :- ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. ఖాదీ, చేనేత, నూలు వస్త్రాల కొనుగోళ్ళు అధికంగా ఉంటాయి. మీ సంతానం కోసం అధికంగా శ్రమిస్తారు. మీ శ్రీమతి మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు. మీ వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులకు గురికాకండి.
 
మీనం :- ఉద్యోగస్తులకు స్థానమార్పిడి, కొత్త బాధ్యతలు చేపట్టే ఆస్కారం ఉంది. స్త్రీలకు ఆడంబరాలు, విలాసాల పట్ల ఆసక్తి వస్తుంది. విద్యార్ధులు ఉన్నత విద్యలకై చేయుయత్నాలు ఫలిస్తాయి. దైవ సేవా, పుణ్యకార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. శతృవులపై విజయం సాధిస్తారు.