సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

25-05-22 బుధవారం రాశిఫలాలు ... గాయిత్రి మాతను ఆరాధించిన శుభం

simha raasi
మేషం :- వస్త్ర, బంగారు, వెండి రంగాల్లో వారికి శుభదాయకం. మిత్రులతో కలిసి విందు, వినోదాలలో ధనం విరివిగా వ్యయం చేస్తారు. ఉద్యోగస్తులకు విధినిర్వహణలో ఏకాగ్రత ఎంతో ముఖ్యం. శాస్త్ర, సాంకేతిక రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. రాజకీయనాయకులకు తరచు సభ, సమావేశాల్లో పాల్గొంటారు.
 
వృషభం :- ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రముఖుల ప్రమేయంతో ప్రభుత్వ కార్యాలయాల్లోని పనులు సానుకూలమవుతాయి. ఆడిట్, అక్కౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికంగా ఉంటాయి.
 
మిథునం :- ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి సమస్యలు తలెత్తుతాయి. కొబ్బరి, పండ్ల, పానీయ వ్యాపారస్తులకు పురోభివృద్ధి కానవస్తుంది. శత్రువులు మిత్రులుగా మారతారు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేసి ప్రశంసలు పొందుతారు.
 
కర్కాటకం :- వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కని పెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. బంధువుల రాక పోకలు అధికమవుతాయి. మొక్కుబడులు చెల్లిస్తారు. స్థిరాస్తి క్రయవిక్రయాలు వాయిదా పడతాయి. రుణాలు తీరుస్తారు. సోదరీ, సోదరుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు.
 
సింహం :- ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. దంపతుల మధ్య కలహాలు తలెత్తే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. మత్స్య, పాడి పరిశ్రమల వారికి సామాన్యం. స్త్రీలకు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. నిరుద్యోగులు, వృత్తులు, ప్రింటింగ్ రంగాల వారికి ఆశాజనకం.
 
కన్య :- కొబ్బరి, పండ్ల, పానీయ వ్యాపారస్తులకు పురోభివృద్ధి కానవస్తుంది. నూతన ప్రదేశ సందర్శనలపట్ల ఆసక్తి పెరుగుతుంది. రావలసిన ధనం చేతికందుతుంది. ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహాయం అందిస్తారు. అధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. విపరీతమైన ఖర్చులు, శ్రమాధిక్యత వల్ల మనస్సు నిలకడగా ఉండదు.
 
తుల :- భార్యా, బిడ్డలతో స్వల్పంగా మనస్పర్ధలు తలెత్తగలవు. వైద్యులకు శస్త్రచికిత్స చేయునపుడు ఏకాగ్రత అవసరం. గృహోపకరణాలను అమర్చుకోవటంలో మునిగిపోతారు. స్త్రీలు షాపింగుకు ధనం బాగా ఖర్చు చేస్తారు. సంఘంలో మీకు పేరు, ప్రఖ్యాతులు పెరుగును. పత్రికా సిబ్బందికి చికాకులు అధికమవుతాయి.
 
వృశ్చికం :- మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోవటం ఎంతైనా అవసరం. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి అధిక పర్యటనల వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. సిమెంటు, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ద్విచక్ర వాహనాలపై దూర ప్రయాణాలు క్షేమం కాదని గమనించండి.
 
ధనస్సు :- ఆదాయానికి మించి ఖర్చులు అధికమవుతాయి. ఉద్యోగస్తులు చాకచక్యంగా వ్యవహరంచి ఒక సమస్య నుంచి క్షేమంగా బయటపడతారు. కీలకమైన వ్యవహారాల్లో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. వాహన చోదకులకు ఏకాగ్రత ప్రధానం. విద్యార్థులు ఉన్నత విద్యల కోసం విదేశాలు వెళ్ళేందుకు మార్గం సుగమమవుతుంది.
 
మకరం :- ఒక సమాచారం బాగా ఆలోచింపచేస్తుంది. స్త్రీలకు ఆరోగ్య సంతృప్తి, శారీరకపటుత్వం నెలకొంటాయి. బంధువుల ఆకస్మిక రాక ఇబ్బంది కలిగిస్తుంది. మీ ఓర్పుకు పరీక్ష సమయం. వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.
 
కుంభం :- స్థిరాస్తి అమ్మకంపై ఒత్తిడివల్ల ఆందోళనలకు గురవుతారు. ప్రయాణాలలో అసౌకర్యానికి లోనవుతారు. తలపెట్టిన పనులు ఆశించినంత చురుకుగా సాగవు. కుటుంబీకులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. ఇంటికి చిన్న చిన్న మరమ్మత్తులు చేయించే అవకాశం ఉంది. చేపట్టిన పనులు వాయిదా పడతాయి.
 
మీనం :- పొగడ్తలు, మొహమ్మాటాలకు లొంగిపోవద్దు. చేపట్టిన పనులు విసుకుగు కలిగించినా మొండిగా పూర్తి చేస్తారు. మీ కుటుంబానికి మీరు అవసరం కనుక వ్యసనాలకు దూరంగా ఉండండి. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, ప్రోత్సాహం లభిస్తాయి. ఉమ్మడి వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు ప్రగతి పథంలో కొనసాగుతాయి.