సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

01-06-22 బుధవారం రాశిఫలాలు ... మహావిష్ణువును పూజించిన పురోభివృద్ధి...

astro4
మేషం :- ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. ఉద్యోగస్తులకు రావలసిన అలవెన్సులు మంజూరవుతాయి. వాయిదా వేసిన పనులు పునఃప్రారంభిస్తారు. స్త్రీలకు బంధు వర్గాలతో సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. ప్రణాళికాబద్దంగా శ్రమించి మీ పనులు సకాలంలో పూర్తిచేస్తారు.
 
వృషభం :- విద్యార్థులకు టెక్నికల్ రంగంలో అవకాశాలు లభిస్తాయి. ఆశ్చర్యకరమైన సంఘటన లెదురవుతాయి. ఉపాధ్యాయులకు, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. తలపెట్టిన పనులు ఒకపట్టాన పూర్తికావు. రుణయత్నాల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కుంటారు. మీ మాటకు సంఘంలో మంచి స్పందనలభిస్తుంది.
 
మిథునం :- స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. వ్యవసాయ, తోటల రంగాల వారు నిరుత్సాహానికి లోనవుతారు. చెప్పుడు మాటల ప్రభావం మీపై అధికంగా ఉంటుంది. ఉద్యోగస్తులు సమర్థంగా పనిచేసి అధికారుల ప్రశంసలందుకుంటారు. మీ ఆలోచనలను తప్పుదారి పట్టించేందుకు ఆస్కారం ఉంది.
 
కర్కాటకం :- పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. ఉపాధ్యాయులకు, మార్కెట్ రంగాల వారికి మార్పులు అనుకూలిస్తాయి. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు. స్త్రీలకు చుట్టుపక్కల వారితో సఖ్యత నెలకొంటుంది. విందులు, వినోదాలు, సమావేశాల్లో అందరినీ ఆకట్టుకుంటారు.
 
సింహం :- విద్యార్థులకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. ఉద్యోగస్తులకు తోటివారి కారణంగా మాటపడవలసి వస్తుంది. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. స్త్రీలకు ఆభరణాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. ప్రేమికులకు ఊహించని చికాకులు తలెత్తుతాయి.
 
కన్య :- హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. విద్యార్థులకు దూర ప్రాంతంలో కోరుకున్న కోర్సులో ప్రవేశం లభిస్తుంది. ఓర్పు, పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. ఆస్తి పంపకాల్లో పెద్దల వైఖరి నిరుత్సాహం కలిగిస్తుంది. సన్నిహితుల ప్రోత్సాహంతో కొత్త యత్నాలు మొదలెడతారు.
 
తుల :- ఆర్థికంగా పురోగమించటానికి చేయుయత్నాలు కలిసివస్తాయి. మీ పథకాలు, ప్రణాళికలు గోప్యంగా ఉంచండి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. మీ సంతానం ఉన్నత విద్యల గురించి ఒక నిర్ణయానికి వస్తారు. అనుకున్న పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తిచేస్తారు.
 
వృశ్చికం :- ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. దంపతుల మధ్య అభిప్రాయభేదాలు, కలహాలు తలెత్తుతాయి. ప్రముఖులను, మిత్రులను కలుసుకుంటారు. క్లిష్ట సమయంలో బంధువుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. కొత్తగా చేపట్టిన వ్యాపారాలు నిలకడగా సాగుతాయి.
 
ధనస్సు :- ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. వైద్యరంగంలోని వారు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సంతృప్తి, పురోభివృద్ధి కానవస్తుంది. 
 
మకరం :- కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పాత బిల్లులు చెల్లిస్తారు. రాజీ ధోరణితో వ్యవహరించటం వల్ల ఒక సమస్య మీకు అనుకూలంగా పరిష్కారమవుతుంది. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల అవసరం. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది.
 
కుంభం :- శారీరక శ్రమ, విశ్రాంతి లోపం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. మీ అవసరాలకు సరిపడ ధనం సమకూర్చుకుంటారు. స్త్రీలకు పనివారితో సమస్యలు తప్పవు. రహస్య విరోధులు అధికం కావడం వల్ల రాజకీయాల్లో వారికి ఆందోళన తప్పదు. వృత్తుల వారికి శ్రమాధిక్యత మినహా రాబడి ఆశించినంతగా ఉండదు.
 
మీనం :- విదేశీయానం కోసం చేసే యత్నాలు ఒక కొలిక్కివస్తాయి. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం మంచిది. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. నిరుద్యోగులకు సమాచార లోపం వల్ల ఒక అవకాశం చేజారిపోతుంది. విందులు, వినోదాల్లో మీ బలహీనతలు ఇబ్బందులకు దారితీస్తాయి. ఖర్చులు అధికమవుతాయి.