1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వార్షిక ఫలం
  4. telugu rasi phalalu 2021, vrishabha rashi 2021, Taurus 2021: Happy time came for unmarried women, New problems for students

వృషభ రాశి 2021: అవివాహితులకు శుభ సమయం- Video

vrishabha rashi 2021
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
ఆదాయం: 2 వ్యయం: 8 రాజపూజ్యం: 7 అవమానం: 3
ఈ రాశివారికి దైనందిన జీవితంలో శుభఫలితాలు గోచరిస్తున్నాయి. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. గృహం నిత్యం సందడిగా ఉంటుంది. ఆదాయం కంటే ఖర్చులు అధికం. వాహనం తదితర విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రభుత్వ సంబంధిత పనువు సానుకూలమవుతాయి. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. స్థల వివాదాలు, కోర్టు వ్యవహారాలు పరిష్కార దిశగా సాగుతాయి.
 
అవివాహితులకు శుభసమయం. సంస్థల స్థాపనల దిశగా ఆలోచిస్తారు. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరం. వ్యవసాయ, తోటల రంగాల వారికి దిగుబడి ఆశాజనకంగా ఉంటుంది. మద్దతు ధర విషయంలో అంత సంతృప్తి ఉండదు. విద్యార్థులకు కొత్త సమస్యలెదురవుతాయి. విదేశీయానం, ఉన్నత చదువుల విషయంలో ఇబ్బందులెదురవుతాయి.
 
ప్రైవేట్ విద్యాసంస్థలకు ఆశాజనకం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కొత్త వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఆధ్యాత్మికత వైపు దృష్టి మళ్లుతుంది. తరుచు దైవకార్యాల్లో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. స్త్రీలకు సంఘంలో గుర్తింపు, ఆదరణ లభిస్తుంది.
తర్వాతి కథనం
2021 మేషరాశి: ఈ ఏడాది అంతా శుభదాయకమే... ఐతే?- video