మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వార్షిక ఫలం
Written By రామన్
Last Updated : గురువారం, 10 డిశెంబరు 2020 (21:46 IST)

ధనుస్సు రాశి 2021: ఈ ఏడాది వివాహ యోగం వుంది

ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
ఆదాయం: 11 వ్యయం: 5 రాజపూజ్యం: 7 అవమానం: 5
ఈ రాశివారికి రాహువు, గురులు అనుకూలంగా వుంటాయి. రుణ సమస్యలు నుంచి బయటపడతారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. మీదైన రంగంలో పురోగతి సాధిస్తారు. ఈ ఏడాది వివాహ యోగం ఉంది. వాగ్ధాటితో నెట్టుకొస్తారు. ఆదాయం సంతృప్తికరం. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలకు అనుకూలం.
 
దంపతుల ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. సంస్థల స్థాపనకు అనుకూలం. ఉద్యోగస్తులకు సత్కాలం నడుస్తోంది. అధికారుల మన్ననలు పొందుతారు. ఉపాధ్యాయులకు స్థానచలనం. వ్యవసాయ, తోటల రంగాల వారికి ఆశాజనకం.
 
పత్తి, మిరప, పొగాకు సాగుదార్లు లాభాలు గడిస్తారు. కోర్టు వ్యవహారాలు, స్థల వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారాల్లో పురోభివృద్ధి సాధిస్తారు. హోల్ సేల్ వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలి. కార్మికులు, వృత్తుల వారికి ఆదాయం బాగుంటుంది. స్టాక్ మార్కెట్ పుంజుకుంటుంది. విదేశీయాన యత్నం ఫలిస్తుంది. జూదాలు, బెట్టింగులకు దూరంగా ఉండాలి.