వృశ్చిక రాశి 2021: కలిసి వచ్చే కాలం, అవివాహితులకు శుభ యోగం

Scorpio 2021
రామన్| Last Modified గురువారం, 10 డిశెంబరు 2020 (21:26 IST)
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట
ఆదాయం: 8 వ్యయం: 14 రాజపూజ్యం: 4 అవమానం: 5
అన్ని రంగాల వారికి కలిసివచ్చే సమయం. తలపెట్టిన కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. యత్నాలతు ఆత్మీయుల సహకారం ఉంటుంది. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు విపరీతం. అవసరాలకు ఏదో విధంగా ధనం అందుతుంది. పరిచయాలు ఉన్నతికి తోడ్పడుతాయి. సంఘంలో గుర్తింపు లభిస్తుంది. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. అవివాహితులకు శుభయోగం.

దంపతుల మధ్య చిన్న చిన్న కలహాలు మినహా అవగాహనకు రాగలుగుతారు. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. నిర్మాణాలు, మరమ్మతులు చేపడతారు. వ్యవసాయ రంగాల వారికి రబీ కంటే ఖరీఫ్ దిగుబడులు ఆశాజనకం. వాణిజ్య పంటల సాగుదార్లకు లాభదాయకం. పరిశ్రమల స్థాపనలకు అడ్డంకులు తొలగిపోతాయి.

ఉద్యోగస్తులకు పదవీయోగం, స్థానచలనం. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికంగా ఉంటుంది. విద్యార్థులకు ఏకాగ్రత ప్రధానం. ఓర్పుతో శ్రమిస్తే గానీ లక్ష్యం సాధించలేరు. వ్యాపారాల్లో పురోభివృద్ధి, అనుభవం గడిస్తారు. ప్రస్తుత వ్యాపారాలే కొనసాగించండి. ఆధ్యాత్మిక పట్ల ఆసక్తి నెలకొంటుంది. ఆలయాలు, సేవా సంస్థలకు సాయం అందిస్తారు.దీనిపై మరింత చదవండి :