సోమవారం, 27 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వార్షిక ఫలం
Written By రామన్
Last Updated : శుక్రవారం, 18 డిశెంబరు 2020 (13:49 IST)

మిధున రాశి 2021: గురు బలం వుంది, ఉద్యోగస్తులకు మాత్రం- video

మిధునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఆదాయం: 5 వ్యయం: 5 రాజపూజ్యం: 3 అవమానం: 6
 
ఈ రాశివారి గోచారం పరిశీలించగా గురుబలం బాగుంది. గురు ప్రభావంతో ఆదాయ వ్యయాలు సమస్థాయిలో వుంటాయి. ఏ కార్యం తలపెట్టినా విజయవంతమవుతుంది. వ్యవహార దక్షతతో రాణిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు కలిసివస్తాయి. అవగాహన లేని విషయాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. 
 
అవివాహితులకు శుభసూచకం. ఉద్యోగస్తులకు కొత్త ఇబ్బందులెదురవుతాయి. అధికారులకు బాధ్యతల మార్పు, స్థానచలనం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వాణిజ్య ఒప్పందాలకు అనుకూలం. పారిశ్రామికవేత్తలు, కార్మికులకు కలిసివచ్చే సమయం. విద్యార్థులు పరీక్షలు బాగా రాస్తారు. వ్యవసాయ రంగాల వారికి సామాన్యం. ఆశించిన మద్దతు ధర లభించకపోవచ్చు.
 
వైద్య, సేవ, న్యాయ, సాంకేతిక రంగాల్లో రాణిస్తారు. ఆస్తి వివాదాలు, కోర్టు వ్యవహారాలు చికాకు పుట్టిస్తాయి. స్వల్ప అస్వస్థతలు మినహా ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి పెడతారు. కళాకారులకు ప్రోత్సాహకరం.