1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
  4. Coconut Health benefits

కొబ్బరి నూనెను వాడుతున్నారా? లేకుంటే అంతే సంగతులు..

కొబ్బరిలో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలెన్నో వున్నాయి. కొబ్బరి నూనెను వంటల్లో వాడుకుంటే బరువు తగ్గుతారు. అలాగే కొబ్బరి నూనెను రకరకాల సౌందర్య లేపనాల తయారీలో కూడా ఉపయోగిస్తారు. కొబ్బరి పాలు, కొబ్బరి నూనె

Coconut
కొబ్బరిలో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలెన్నో వున్నాయి. కొబ్బరి నూనెను వంటల్లో వాడుకుంటే బరువు తగ్గుతారు. అలాగే కొబ్బరి నూనెను రకరకాల సౌందర్య లేపనాల తయారీలో కూడా ఉపయోగిస్తారు. కొబ్బరి పాలు, కొబ్బరి నూనెను రకరకాల వంటకాలలో కూడా వాడుతుంటారు. అలాంటి కొబ్బరి నూనెను వాడే వారు ప్రస్తుతం కరువైపోతున్నారు.
 
పూర్వ కాలంలో చిన్న పిల్లలకు కొబ్బరి నూనెతో ఒళ్లంతా మర్దన చేసిన తర్వాతనే స్నానం చేయించేవాళ్లు. నేటి తరానికి ఆ సుగుణాలను అందించేందుకు కొబ్బరి నీళ్లతో, లేత కొబ్బరితో తయారుచేసే సబ్బులు మార్కెట్‌లోకి వచ్చేశాయి. ఇది మృత కణాలను తొలగించి, చర్మాన్ని మృదువుగా చేసేందుకు ఇవి ఉపయోగపడతాయి.

అయితే కొబ్బరి నూనెను రోజూ తలకు పట్టించడం ద్వారా శరీర ఉష్ణోగ్రత క్రమంగా వుంటుంది. అలెర్జీలు దూరమవుతాయి. కంటి చూపు మెరుగ్గా వుంటుంది అంటున్నారు ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. కొబ్బరి నూనెను తలకు పట్టించకపోతే.. చర్మ సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
అలాగే కొబ్బరిలో పోషకాలు ఎక్కువ. కెలోరీలు కార్బోహైడ్రేట్లూ తక్కువ. అందుకే ఒబిసిటీతో ఇబ్బంది పడేవారు వంటల్లో కొబ్బరి నూనెను ఉపయోగించాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా కేరళలో ఈ కొబ్బరి చెట్లు అధికంగా ఉండటం వలన అన్ని రకాల వంటకాలలో కొబ్బరి నూనెను, కొబ్బరి పాలను ఉపయోగిస్తారు. ఇది శరీరంలోని కొవ్వును తగ్గిస్తుంది. 
 
కొబ్బరి నూనెను శిరోజాలకు, కోకో ఫెయిర్ నెస్ క్రీమ్స్, మాయిశ్చరైజర్స్, ముఖారవిందాన్నీ, చర్మసౌందర్యాన్ని రెట్టింపు చేయటానికి ఉపయోగించే అన్నిరకాల కాస్మోటిక్స్ తయారీలో ఉపయోగిస్తారు. నూనె తీసేసిన తర్వాత మిగిలిన కొబ్బరితో తయారుచేసే పిండిని కొబ్బరి పిండి అంటారు. దీనిని రకరకాల బిస్కెట్లు, చాక్లెట్లు, పిండి వంటల తయారీలో వినియోగిస్తారు. ఇది ఆరోగ్యానికి మంచి పోషణను ఇస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
About Writer
kowsalya
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
జలుబుకు విరుగుడు పెరుగు... ఎలా?