ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతోంది : సిటీలో ఆర్గానిక్ పుడ్‌కు క్రేజ్
మారుతున్నకాలమాన పరిస్థితుల దృష్ట్యా నగరవాసులకు ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతోంది. దీంతో తమ ఆహార పద్ధతులపై కూడా ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తున్నారు. ఇందులోభాగంగా, జంక్ ఫుడ్స్‌కు దూరంగా ఉంటూ ఆర్గానిక్ ఫుడ్స్‌పైప
మారుతున్నకాలమాన పరిస్థితుల దృష్ట్యా నగరవాసులకు ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతోంది. దీంతో తమ ఆహార పద్ధతులపై కూడా ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తున్నారు. ఇందులోభాగంగా, జంక్ ఫుడ్స్‌కు దూరంగా ఉంటూ ఆర్గానిక్ ఫుడ్స్‌పైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా నేచురల్ ఫుడ్ ఐటమ్స్‌కి క్రేజ్ పెరుగుతోంది. హోటల్స్ కూడా సీజనల్ ఫుడ్‌ఐటమ్స్ అందిస్తూ అందరిని ఆకట్టుకుంటున్నాయి.
అనేక మంది నగర వాసులు నిత్యం తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. దీంతో తాము తీసుకునే ఆహారంపై పెద్దగా శ్రద్ధ చూపించలేక పోతున్నారు. అయితే, ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ సేంద్రీయ ఆహారంపై వైపు చాలామంది మొగ్గు చూపుతున్నారు. కెమికల్ ఫుడ్స్‌తో వచ్చే అనారోగ్య సమస్యల నుంచి బయటపడాలంటే ఆర్గానిక్ ఫుడ్స్ అలవాటు చేసుకోవడం మంచిదంటున్నారు.
రేటు కాస్త ఎక్కువైనా సేంద్రీయ ఆహారం తినాలని సూచిస్తున్నారు. కొన్ని హోటల్స్, రెస్టారెంట్లు కూడా నేచురల్, ఆర్గానిక్ ఐటమ్స్ అందిస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు వేసవికాలం కావడంతో ఫ్రూట్ జూస్ ఐటమ్స్‌తో పాటు డిఫరెంట్ ఫ్రూట్ ఫ్లేవర్స్‌తో ఐస్ క్రీమ్స్, మాక్ టైల్స్‌ను అందిస్తున్నారు.