శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By pnr
Last Updated : గురువారం, 22 మార్చి 2018 (18:27 IST)

అపోలో ఆస్పత్రిలో ఇంటర్నేషనల్ కొలొరెక్టల్ సింపోసియం 2018

దేశంలోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో అగ్రగామిగా ఉన్న అపోలో ఆస్పత్రి రెండు రోజుల పాటు అంతర్జాతీయ సదస్సును నిర్వహించనుంది. ఈ ఆస్పత్రికి చెందిన ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ కొలొరెక్టల్ సింపోసియం 2018 పేరుతో ఈ నెల 24

దేశంలోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో అగ్రగామిగా ఉన్న అపోలో ఆస్పత్రి రెండు రోజుల పాటు అంతర్జాతీయ సదస్సును నిర్వహించనుంది. ఈ ఆస్పత్రికి చెందిన ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ కొలొరెక్టల్ సింపోసియం 2018 పేరుతో ఈ నెల 24, 25 తేదీల్లో ఈ సదస్సును నిర్వహించనుంది. ఈ వేదిక ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైద్య నిపుణులను ఒక చోటికి చేర్చి, కొలొరెక్టల్ కేన్సర్ ఆపరేషన్, చికిత్సా విధానంపై తమతమ అభిప్రాయాలను వెల్లడించనున్నారు.
 
ప్రపంచాన్ని వణికిస్తున్న మూడో అతిపెద్ద వ్యాధి కేన్సర్. ప్రపంచవ్యాప్తంగా 6,94,000 మంది ప్రతి యేటా చనిపోతుండగా, ప్రతి యేడాది 1.4 మిలియన్ కేసులు కొత్తగా కనుగొంటున్నారు. వీటిలో ప్రతి మూడు కేసుల్లో ఒకటి కొలొక్టరెల్ కేన్సర్‌గా ఉన్నట్టు ఈ ఆస్పత్రికి చెందిన ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ కొలొరెక్టల్ విభాగ వైద్యులు వెల్లడించారు.
 
ఈ సందర్భంగా అపోలో ఆస్పత్రి ఛైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి మాట్లాడుతూ, కొలొన్ కేన్సర్ రిస్క్ నానాటికీ పెరిగిపోతోందన్నారు. చిన్నవయసు యువతీయువకులు అనేక మంది ఈ వ్యాధి బారిన పడుతున్నట్టు తెలిపారు. ప్రతి యేడాది 1200 కొలొరెక్టల్ కేసులను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ తరహా కేన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించినట్టయితే పూర్తిగా నివారించవచ్చని తెలిపారు.