గురువారం, 28 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 29 మార్చి 2017 (14:44 IST)

జయమ్మ ప్రాణం విలువ రూ. 750 కోట్లు? ఆర్కే నగర్ ఓటర్లకు దీప వరాల జల్లు..

తమిళనాడు దివంగత సీఎం జయలలిత మేనకోడలు ఆర్కే నగర్ ఓటర్లకు వరాల జల్లు కురిపించారు. ఎంజీఆర్ అమ్మ దీపా పేరవై ప్రధాన కార్యదర్శిగా దీపా జయకుమార్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ ఎన్నికల మేనిఫెస్టోలో అత్

తమిళనాడు దివంగత సీఎం జయలలిత మేనకోడలు ఆర్కే నగర్ ఓటర్లకు వరాల జల్లు కురిపించారు. ఎంజీఆర్ అమ్మ దీపా పేరవై ప్రధాన కార్యదర్శిగా దీపా జయకుమార్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ ఎన్నికల మేనిఫెస్టోలో అత్తమ్మ, దివంగత సీఎం జయలలిత మృతిపట్ల ఉన్న అనుమానాలను నివృత్తి చేసేందుకుగాను సీబీఐతో విచారణ జరిపేందుకు వీలుగా పోరాడతానని మేనిఫెస్టోలో పేర్కొన్నారు.

అలాగే మెరుగైన రోడ్లు, మంచినీటి సరఫరాకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆర్కే నగర్ ప్రజలు ఎదుర్కొనే ప్రధాన సమస్య ట్రాఫిక్ నియంత్రణ కోసం కీలక ప్రాంతాల్లో వంతెనలు నిర్మిస్తామన్నారు. ముఖ్యంగా కచ్చదీవిని స్వాధీనం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. రాయితీతో పడవలు కొనుక్కునేందుకు జాలర్లకు సహకరిస్తామని కూడా దీపా జయకుమార్ హామీ ఇచ్చారు. 
 
ఇదిలా ఉంటే.. అమ్మ మరణం ఉన్న సస్పెన్స్‌కు తెరదించాలని.. అందుకోసం సీబీఐ విచారణ జరపాలని రాజకీయ పార్టీలన్నీ డిమాండ్ చేస్తున్న తరుణంలో.. అమ్మ మృతికి శశికళనే కారణమని దీప, ఓపీఎస్ వర్గాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో.. అపోలో ఆస్పత్రికి రూ.750 కోట్ల మొత్తాన్ని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కోసం కేంద్రం సిఫార్సు చేసింది.

ఈ విషయం వెలుగులోకి రాగానే.. జయలలిత ప్రాణం విలువ రూ.750కోట్లా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దీనిపై ట్విట్టర్లో‌ ప్రత్యేకమైన హ్యాష్‌టాగ్ కూడా క్రియేట్ చేశారు. ఈ ట్యాగ్‌పై నెటిజన్లు తమ అభిప్రాయాలను పొందుపరుస్తున్నారు. కేంద్రం సిఫార్సుకు... అమ్మ మరణానికి లింకుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.