సంబంధిత వార్తలు
- వైఫైతో ఆరోగ్యానికి హాని... నిజమే.. తస్మాత్ జాగ్రత్త
- లైంగిక వ్యాధులతో జననేంద్రియాల్లో వచ్చే ఇన్ఫెక్షన్లు ఏమిటి?
- రాత్రిపూట పడక గదిలో మొబైల్ ఫోన్స్... ఇవి డేంజర్...
- గోళ్లు తీసుకున్న వ్యక్తిని ఉగ్రవాది అనుకున్నారు.. రైలులోనే పరుగులు తీశారు..
- వారెవ్వా.. ఏం డ్రెస్సురా బాబూ.. స్టార్ రెడ్కార్పెట్లో స్పెషల్ అట్రాక్షన్... (Video)
గోళ్లు పెంచుకుంటే ఎంతటి సమస్యలు వస్తాయో తెలుసా..?
గోళ్ళు కొంతమంది అలా పెరిగి పెరగగానే వెంటనే కట్ చేసేస్తారు. కానీ కొంతమంది మాత్రం అదేదో శరీరానికే అందం పెంచేటట్లు చుట్టూ ఉన్న ప్రపంచం తమ గోళ్ళవైపే ఉన్నట్లు తెగ పెంచేస్తూ ఉంటారు. అయితే ఇలా గోళ్ళు పెంచడం వల్ల లాభం లేకపోగా నష్టాలు చాలానే ఉన్నాయని ఎక్కువమం
గోళ్ళు కొంతమంది అలా పెరిగి పెరగగానే వెంటనే కట్ చేసేస్తారు. కానీ కొంతమంది మాత్రం అదేదో శరీరానికే అందం పెంచేటట్లు చుట్టూ ఉన్న ప్రపంచం తమ గోళ్ళవైపే ఉన్నట్లు తెగ పెంచేస్తూ ఉంటారు. అయితే ఇలా గోళ్ళు పెంచడం వల్ల లాభం లేకపోగా నష్టాలు చాలానే ఉన్నాయని ఎక్కువమందికి తెలియని విషయం. అసలు గోళ్ళను పెంచడం వల్ల ఎలాంటి సమస్యలు ఉన్నాయో తెలుసుకుందాం.
చాలామంది ఒత్తిడి ఎక్కువగా ఉంటే గోళ్ళను ఎడాపెడా కొరికేస్తూ ఉంటారు. ఇటువంటి వారికి ఎంత చెప్పినా అలవాటు మార్చుకోరు. గోళ్ళు కత్తిరించడం మాత్రమే ఉత్తమమైన మార్గం. అలా కాకుండా గోళ్ళను కొరికితే గోళ్ళలోని క్రిములన్నీ సులభంగా శరీరంలోకి ప్రవేశిస్తాయి. అంతేకాకుండా బాగా పెరిగిన గోళ్ళు ఉండటం వల్ల స్నానం చేసే సమయంలో శరీరాన్ని రుద్దుతున్నప్పుడు శరీరాన్ని గాయం చేసే ప్రమాదం ఉంటుంది. అప్పటికే గోళ్ళలో నివాసముంటున్న రకరకాల క్రిములకు శరీరంలోకి ఈజీగా వెళ్ళిపోతాయి. భోజనానికి ముందు ఎంత శుభ్రంగా చేతులు కడిగినా గోళ్ళలో మురికి అలాగే ఉంటుంది. మరీ ముఖ్యంగా గోళ్ళకు ఏదైనా తగిలితే విపరీతమైన నొప్పి కలుగుతుంది.
ఒకవేళ పొరపాటున విరిగితే ఆ నొప్పి వర్ణించలేనిది. గోళ్ళను పెంచుకోకపోవడం మంచిది. గోళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు కట్ చేయకూడదు. మంగళవారం గోళ్ళు కట్ చేయకూడదు. శుక్రవారం మహాలక్ష్మి కాబట్టి ఆ రోజు కూడా కట్ చేయకపోవడం చాలా మంచిది. కటింగ్ చేసుకున్నప్పుడే గోళ్ళు తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. స్నానానికి ముందే గోళ్ళను తొలగించాలి. ఇంటి బయటే గోళ్ళను తీయాలి. మంగళ, శుక్రవారం తప్ప ఇంకెప్పుడైనా గోళ్ళు తీసుకోవచ్చు. అలాగని రాత్రి వేళల్లో గోళ్లు తీయడం చేయకూడదు.
తర్వాతి కథనం
