శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By chj
Last Modified: గురువారం, 21 డిశెంబరు 2017 (21:51 IST)

వైఫైతో ఆరోగ్యానికి హాని... నిజమే.. తస్మాత్ జాగ్రత్త

ఈ రోజుల్లో నగరాల్లో వైఫై లేని ఇళ్ళు, ఆఫీసులు ఊహించడమే కష్టం. ఇళ్ళు, కార్యాలయం, విమానాశ్రయాలు, రెస్టారెంట్లు, క్యాబుల్లో ఇలా ఇందుగలదు.. అందు లేదన్న సందేహం వలదన్నట్లు అన్నిచోట్ల వైఫై కూడా సర్వాంతర్యామిలా విస్తరిస్తోంది. కనీస అవసరాల గురించి చెప్పాలంటే ఇ

ఈ రోజుల్లో నగరాల్లో వైఫై లేని ఇళ్ళు, ఆఫీసులు ఊహించడమే కష్టం. ఇళ్ళు, కార్యాలయం, విమానాశ్రయాలు, రెస్టారెంట్లు, క్యాబుల్లో ఇలా ఇందుగలదు.. అందు లేదన్న సందేహం వలదన్నట్లు అన్నిచోట్ల వైఫై కూడా సర్వాంతర్యామిలా విస్తరిస్తోంది. కనీస అవసరాల గురించి చెప్పాలంటే ఇప్పటివరకు తిండి, గుడ్డ, నీళ్ళు అని చెప్పేవాళ్లు. కానీ ఇప్పుడు ఇంటర్నెట్ అని చెప్పక తప్పదు. 
 
ఆర్‌ఎఫ్‌ ఎక్స్‌పోజర్ గురించి ఎలుకల పైన నిర్వహించిన అధ్యయనంలో మూత్ర పిండాల అభివృద్థికి జాప్యం ఏర్పడినట్లు తెలిసింది. వైఫై ఆన్‌లో ఉండగా, లేకుంటే సెల్‌ ఫోన్ సమీపంలో ఉంచుకుని పడుకొని ఉండడం వల్ల దీర్ఘ కాల నిద్ర సమస్యలు సంభవిస్తాయి. వైఫై నుంచి నిరంతరంగా వచ్చే తరంగాలతో నిద్ర సమస్య ఏర్పడుతుంది. 2014లో ప్రచురితమైన ఒక చైనీస్ పరిశోధనలో మూడు నిమిషాల ఆర్‌ఎఫ్‌ రేడియేషన్ వల్ల మెదడులోని కొన్ని స్థానాల్లో అత్యంత ఫ్రీక్వెన్సీ హెచ్చుతగ్గులు ఏర్పడుతాయని తేలింది.
 
ల్యాప్‌టాప్‌ల వల్ల వచ్చే వేడి వీర్యకణాలకు హాని చేస్తుందని పరిశోధనలో తేలింది. 2012లో అర్జెంటీనాలో నిర్వహించిన ఒక అధ్యయనంలో వైఫై కారణంగా వీర్య చలనస్థితి తగ్గి డిఎన్ఎలో వైరుధ్యాలు సంభవిస్తాయని తేలింది. ఆ అధ్యయనంలో వీర్యం నమూనాలను నాలుగు గంటల పాటు వైర్లెస్ ఇంటర్నెట్ కనెక్ట్ అయినా ల్యాప్ టాప్‌కు సమీపంలో ఉంచారు. ఈ రేడియేషన్‌ల వల్ల క్యాన్సర్ వస్తుందా లేదా అన్న విషయంపై ఇప్పటికే సీరియస్‌గా పరిశోధనలు జరుగుతున్నాయి. శాస్త్రీయ సమీక్షా కథనం ప్రకారం గర్భవతులకు చాలా హాని ఉంటుందని తేలింది.