శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 21 నవంబరు 2017 (11:59 IST)

వైఫై డబ్బా: 1 జీబీ డేటా రూ.20 మాత్రమే.. రూ.2కి 100 ఎంబీల డేటా

రిలయన్స్ జియో ఉచిత డేటా పేరిట టెలికాం రంగాన్ని ఓ ఊపు ఊపేసిన సంగతి తెలిసిందే. జియోకు పోటీపడి.. మిగిలిన టెలికాం సంస్థలన్నీ ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఫై డబ్బా పేరుతో బ

రిలయన్స్ జియో ఉచిత డేటా పేరిట టెలికాం రంగాన్ని ఓ ఊపు ఊపేసిన సంగతి తెలిసిందే. జియోకు పోటీపడి.. మిగిలిన టెలికాం సంస్థలన్నీ ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఫై డబ్బా పేరుతో బెంగళూరులో సేవలు ప్రారంభమైనాయి. ఒక జీబీ డేటా రూ.20కి మాత్రమే ఇక్కడ లభిస్తుందని బోర్డు పెట్టేశారు. ఈ మేరకు స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు బెంగళూరుకి చెందిన ఓ స్టార్టప్ సంస్థ కొంత ఊరట కల్పిస్తోంది. ఈ సంస్థ పేరు "వైఫై డ‌బ్బా". 
 
13 నెల‌ల క్రితం ప్రారంభ‌మైన ఈ సంస్థ కేవలం రూ.2కే 100 ఎంబీ డేటాను అందిస్తోంది. అంతేగాకుండా రూ.10కి 500 ఎంబీ, రూ.20కి 1 జీబీ చొప్పున టారిఫ్‌లు కూడా నడుపుతోంది. 24 గంటల వ్యాలిడిటీతో ఈ ఆఫర్లను వినియోగదారులకు అందిస్తోంది. దీన్ని వినియోగించుకోవ‌డం కోసం ఎలాంటి యాప్‌లు, లాగిన్‌లు అక్క‌ర్లేదు. ప్రీపెయిడ్‌ టోకెన్ల ద్వారా వీరి సేవ‌ల‌ను వినియోగించుకోవ‌చ్చు. 
 
వ‌న్ టైమ్ పాస్‌వ‌ర్డ్ ద్వారా మొబైల్ నంబ‌ర్‌ను స‌రిపోల్చుకుని తర్వాత డేటాను సదరు సంస్థ అందజేస్తుంది. నెట్‌వ‌ర్క్ కోసం ఆయా ప్రాంతాల్లో రూటర్లు ఏర్పాటు చేసింది. త్వ‌ర‌లోనే ఈ సేవ‌ను ఇతర మెట్రో న‌గ‌రాల‌కు కూడా విస్త‌రించాల‌ని వైఫై డబ్బా రంగం సిద్ధం చేసుకుంటోంది.