గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Updated : శుక్రవారం, 20 అక్టోబరు 2017 (18:14 IST)

జీతాలు కావాలా? నా ప్యాంటులో వుంది తీస్కెళ్లండి... ప్యాంటు విప్పి మరీ...

బెంగళూరు నగరంలోని పారిశుద్ధ్య కార్మికుల పట్ల ఓ కాంట్రాక్టర్ అసభ్యంగా ప్రవర్తించాడు. తాము పనిచేసిన కాలానికి జీతం ఇవ్వాలని మహిళా కార్మికులు అడిగితే అసభ్య పదజాలాన్ని వాడుతూ ప్యాంటులో వున్న

బెంగళూరు నగరంలోని పారిశుద్ధ్య కార్మికుల పట్ల ఓ కాంట్రాక్టర్ అసభ్యంగా ప్రవర్తించాడు. తాము పనిచేసిన కాలానికి జీతం ఇవ్వాలని మహిళా కార్మికులు అడిగితే అసభ్య పదజాలాన్ని వాడుతూ ప్యాంటులో వున్నదాన్ని తీస్కెళ్లాలంటూ ప్యాంటు విప్పి చూపించాడు. అంతేకాదు... మహిళల పట్ల లైంగికంగా వేధింపులకు కూడా దిగాడు.
 
వివరాల్లోకి వెళితే... బెంగళూరులోని కేఆర్ పురం పరిధిలో పారిశుద్ధ్య విధులను నిర్వర్తిస్తున్నారు కొందరు మహిళలు. ఈ ప్రాంత పారిశుద్ధ్య పనులను నిర్వహిస్తున్నాడు ఓ కాంట్రాక్టర్. ఈ క్రమంలో మహిళలకు ఇవ్వాల్సిన జీతాలను సకాలంలో చెల్లించకుండా ఇబ్బందులు పెడుతున్నాడు. జీతాలు అడిగినందుకు వారిపై అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డాడు. 
 
ప్యాంటును కింది వరకూ లాగి జీతం తన ప్యాంటులో వున్నది తీసుకెళ్లాలంటూ జుగుప్సకరంగా ప్రవర్తించాడు. ఎక్కువగా మాట్లాడితే అత్యాచారం చేస్తానని బెదిరింపులకు కూడా దిగాడు. దీనితో కార్మికలంతా తమ గోడును యూనియన్ నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. అతడి ప్రవర్తనపై కేఆర్ పురం పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశారు. 
 
విషయం తెలుసుకున్న కాంట్రాక్టర్ ఐదుగురు గూండాలను తీసుకెళ్లడమే కాకుండా తనపై ఫిర్యాదు చేసినవారిలో ప్రధానంగా వున్న మహిళను బయటకు ఈడ్చి ఇనుప రాడ్డుతో కొట్టి ఆమెను పోలీసు స్టేషను వరకూ ఈడ్చుకెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. విషయంపై మరోసారి పోలీసు స్టేషనుకు వెళ్లగా నిందితుడిపై లైంగిక వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం అతడి కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు.