1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 15 అక్టోబరు 2017 (16:06 IST)

శబరిమల లైంగిక పర్యాటక కేంద్రంగా మారుతుంది.. ప్రయార్ గోపాలకృష్ణ

శబరిమల ఆలయంలోకి మహిళలకు ప్రవేశంకల్పించే అంశంపై ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు ప్రయార్ గోపాలకృష్ణ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శబరిమల దర్శనానికి మహిళలకు అనుమతించడం ఈ ప్రాంతంలో అనైతిక

శబరిమల ఆలయంలోకి మహిళలకు ప్రవేశంకల్పించే అంశంపై ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు ప్రయార్ గోపాలకృష్ణ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శబరిమల దర్శనానికి మహిళలకు అనుమతించడం ఈ ప్రాంతంలో అనైతిక కార్యకలాపాలకు దారితీస్తుందని, థాయ్‌లాండ్ మాదిరిగా శబరిమల లైంగిక పర్యాటక కేంద్రంగా మారే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. అందువల్ల 10 ఏండ్లలోపు 50 యేళ్ళ వయసు దాటిన మహిళలను మాత్రమే శబరిమల అయ్యప్పగుడిలోకి అనుమతిస్తారు. 
 
మహిళలకు శబరిమల ఆలయంలోకి ప్రవేశం కల్పించకపోవడం ప్రాథమిక హక్కులను కాలరాసినట్టేనని, అందువల్ల మహిళలపై విధించిన నిషేధం రాజ్యాంగపరంగా చెల్లుతుందా? లేదా? అనే విషయాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటలకే గోపాలకృష్ణ మాట్లాడుతూ, శబరిమలకు మహిళలను అనుమతిస్తే భద్రతాపరమైన సమస్యలు కూడా ఎదురవుతాయని చెప్పారు. 
 
ఒకవేళ కోర్టు అనుమతించినా ఆత్మగౌరవం గల మహిళలెవరూ శబరిమలకురారని అన్నారు. కాగా మహిళ రుతుక్రమ మైలతో ఉన్నారా లేదా అని పరీక్షించే యంత్రాలను సమకూర్చితే ఆలయంలోకి వారిని రానిస్తామని గోపాలకృష్ణ రెండేండ్ల క్రితం ఇటువంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే.