గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 22 సెప్టెంబరు 2017 (20:39 IST)

అక్క ప్రియుడే చంపేశాడు... వీడియో తీసి మరీ... ఎందుకో తెలుసా?

బెంగళూరులో ఆదాయపు పన్ను అధికారి కుమారుడి కిడ్నాప్ విషాదాంతమైంది. అతడి మృతదేహం సరస్సులో లభించింది. కాగా అతడిని హతమార్చింది అతడి అక్క ప్రియుడే కావడం గమనార్హం. వివరాల్లోకి వెళితే... బెంగళూరులో ఆదాయపు పన్ను శాఖ అధికారిగా పనిచేస్తున్న నిరంజన్ కుమారుడైన శర

బెంగళూరులో ఆదాయపు పన్ను అధికారి కుమారుడి కిడ్నాప్ విషాదాంతమైంది. అతడి మృతదేహం సరస్సులో లభించింది. కాగా అతడిని హతమార్చింది అతడి అక్క ప్రియుడే కావడం గమనార్హం. వివరాల్లోకి వెళితే... బెంగళూరులో ఆదాయపు పన్ను శాఖ అధికారిగా పనిచేస్తున్న నిరంజన్ కుమారుడైన శరత్ ఎన్ఫీల్డ్ మోటారు బైకును కొని దాన్ని తన స్నేహితులకు చూపించి వస్తానని ఇక తిరిగి రాలేదు. 
 
ఆ రోజే తను కొందరు గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో కిడ్నాపయ్యానంటూ చెప్పాడు. అతడలా చెప్పిన మాటలను దుండగులు వీడియో తీసి దాన్ని అతడి తండ్రికి వాట్స్ యాప్ మెసేజ్ పంపాడు. ఆ సందేశం చూసిన వెంటనే నిరంజన్ పోలీసులకు సమాచారం అందించాడు. ఆచూకి కనుగొనేందుకు ప్రయత్నించగా జాడ లభించలేదు. ఈ రోజు ఉదయం శరత్ మృతదేహం లభించింది. 
 
మరోవైపు కిడ్నాపర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. శరత్ ను కిడ్నాప్ చేసింది అతడి అక్క ప్రియుడేనని తేలింది. సదరు యువకుడు రూ. 5 లక్షలు అప్పు చేసి ఆ అప్పులతో సతమతమవుతున్నాడని విచారణలో తేలింది. దానితో ఆ డబ్బును తన ప్రియురాలి సోదరుడిని కిడ్నాప్ చేసి రాబట్టాలని చూసి చివరకి ప్రయత్నం బెడిసికొట్టడంతో అతడిని హతమార్చినట్లు తేలింది. ఈ హత్యకు సహకరించిన మరో ముగ్గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.