బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 27 సెప్టెంబరు 2017 (20:23 IST)

బెంగళూరులో కనిగిరి తరహా ఘటన: ఇన్‌స్టాగ్రామ్‌లో గర్ల్ ఫ్రెండ్ నగ్నఫోటోలు, ఫోన్ నెంబర్ పెట్టేసిన?

పెళ్లికి నిరాకరించిందని.. స్నేహం ముసుగులో ఓ విద్యార్థినిపై యువకులు అత్యాచార యత్నం చేశారు. ప్రతిఘటిస్తున్నా అసభ్యంగా ప్రవర్తిస్తూ.. ఆమెను శారీరకంగా హింసించి.. ఆ దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి, సోష

పెళ్లికి నిరాకరించిందని.. స్నేహం ముసుగులో ఓ విద్యార్థినిపై యువకులు అత్యాచార యత్నం చేశారు. ప్రతిఘటిస్తున్నా అసభ్యంగా ప్రవర్తిస్తూ.. ఆమెను శారీరకంగా హింసించి.. ఆ దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి, సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. సభ్య సమాజం తలదించుకునే ఈ ఘటన ప్రకాశం జిల్లాలోని కనిగిరిలో ఆలస్యంగా వెలుగు చూసింది. 
 
ఇదే తరహాలో తనతో సంబంధం తెంచుకుందనే కోపంతో తన మాజీ గర్ల్ ఫ్రెడ్ నగ్నచిత్రాలు అంతర్జాలంలో పెట్టిన బాయ్‌ఫ్రెండ్ బాగోతం బెంగళూరు నగరంలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. షౌవిక్ భావన్ అనే 22 ఏళ్ల యువకుడు బెంగళూరు నగరంలో బీబీఎం రెండో సంవత్సరం చదువుతున్నాడు. భావన్ అసోం రాష్ట్రం తేజ్‌పూర్ పట్టణానికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమించాడు. అయితే ఆ అమ్మాయి అతనికి దూరమైంది. 
 
ఈ కోపంతో తనతో సన్నిహితంగా వున్న ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈమె వ్యభిచారిణి అంటూ పోస్ట్ చేశాడు. ఈమెతో రాత్రులు గడపాలంటే సంప్రదించండి అంటూ ఫోన్ నెంబర్ కూడా పోస్టు చేసేశాడు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. రంగంలోకి దిగిన పోలీసులు భావన్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసును దర్యాప్తు చేస్తున్నారు.