బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 23 సెప్టెంబరు 2017 (12:03 IST)

పెళ్లి పేరుతో మోసం : నర్సింగ్ విద్యార్థినితో వైద్య విద్యార్థి సహజీవనం

పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ నర్సింగ్ విద్యార్థినితో సహజీవనం చేసిన వైద్య విద్యార్థి, ఆ తర్వాత మరో యువతిని పెళ్లి చేసుకున్న ఘటన ఒకటి మహారాష్ట్రలో వెలుగుచూసింది. ఈ రాష్ట్రంలోని పూణెకు చెందిన 32 యేళ్ల వై

పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ నర్సింగ్ విద్యార్థినితో సహజీవనం చేసిన వైద్య విద్యార్థి, ఆ తర్వాత మరో యువతిని పెళ్లి చేసుకున్న ఘటన ఒకటి మహారాష్ట్రలో వెలుగుచూసింది. ఈ రాష్ట్రంలోని పూణెకు చెందిన 32 యేళ్ల వైద్య విద్యార్థి ఒకరు స్థానికంగా నర్సింగ్ చదువుతున్న ఓ విద్యార్థినిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆరేళ్ళ పాటు సహజీవనం చేశాడు. 
 
ఆ తర్వాత తన తండ్రి ఆరోగ్యం బాగా లేదని, అత్యవసరమని చెప్పి నర్సింగ్ విద్యార్థి నుంచి మూడులక్షల రూపాయలు తీసుకున్నాడు. అనంతరం నర్సింగ్ విద్యార్థినికి తెలియకుండానే పెద్దలు కుదిర్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన నర్సింగ్ విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని పోలీసు కస్టడీకి తీసుకున్నారు.