ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By chj
Last Modified: బుధవారం, 28 ఫిబ్రవరి 2018 (22:24 IST)

చేతిగోళ్లు అలా వుంటే అనారోగ్యమే... ఎలా?

శరీరంలో దాగిన ఆరోగ్య సమస్యలు కొన్ని లక్షణాల రూపంలో బయటపడతాయనే విషయం అందరికి తెలిసిందే. అందుకే ఏ సమస్యతో మనం వైద్యుని దగ్గరకు వెళ్లినా వాళ్లు మన నాలుక, కళ్లు పరిక్షీస్తుంటారు. ఇప్పుడు ఈ కోవలోకి గోళ్లు కూడా వచ్చి చేరాయి. గోళ్లలో వచ్చే మార్పుల ఆధారంగా క

శరీరంలో దాగిన ఆరోగ్య సమస్యలు కొన్ని లక్షణాల రూపంలో బయటపడతాయనే విషయం అందరికి తెలిసిందే. అందుకే ఏ సమస్యతో మనం వైద్యుని దగ్గరకు వెళ్లినా వాళ్లు మన నాలుక, కళ్లు పరిక్షీస్తుంటారు. ఇప్పుడు ఈ కోవలోకి గోళ్లు కూడా వచ్చి చేరాయి. గోళ్లలో వచ్చే మార్పుల ఆధారంగా కొన్ని రుగ్మతలను కనిపెట్టేగలిగే వీలుంది.
 
1. నెయిల్ క్లబ్బింగ్ 
సాధారణంగా గోళ్లు అంచులు కొద్దిగా పైకి లేచి ఉంటాయి. అలా కాకుండా గోళ్లు చివర్లు కిందకి వంగి వేళ్ల చిగుర్లకు అంటుకుపోయినట్లు ఉంటే ఊపిరితిత్తుల జబ్బు, హృద్రోగం, కాలేయ రుగ్మత, పెద్దపేగుల్లో వాపు వంటి వాటికి గురయినట్లు భావించాలి.
 
2. తెల్లని పట్టీలు
గోళ్ల మీద అడ్డంగా ఆ చివరి నుండి ఈ చివరి వరకు రెండు తెల్లని పట్టీలు సాధారణంగా కీమోథెరపీ ఫలితంగా ఏర్పడతాయి. ఇవే గుర్తులు కాలేయం వ్యాధిగ్రస్తమైనా, మూత్రపిండాలు జబ్బుపడినా ఏర్పడుతాయి.
 
3. స్పూన్ నెయిల్స్
గోళ్లు పలచబడి చదునుగా తయారవుతాయి లేదా ఒక నీటి చుక్కను నింపేంత లోతుగా స్పూన్ ఆకారంలో వంపు తిరిగితే విపరీతమైన రక్తహీనత అత్యధికంగా రసాయనాల ప్రభావానికి గురయినట్లు భావించాలి.