గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By సెల్వి
Last Updated : గురువారం, 22 ఏప్రియల్ 2021 (17:58 IST)

తిప్పతీగ కరోనాకు దివ్యౌషధం.. రోగ నిరోధక శక్తిని పెంచుతుందట!

Tippa Teega plant
తిప్పతీగ గురించి అందరికీ తెలిసిందే. పట్టణ శివార్లలోనూ, రోడ్ల పక్కన పొదల్లో కనిపిస్తూ ఉంటుంది. ఇకపై లైట్‌గా తీసుకుంటే పప్పులో కాలేసినట్టే. ఈ కరోనా సంక్షోభంలో దాని విలువ ఏంటో వెలుగులోకి వచ్చింది. ఇన్నాళ్లూ ఈ తీగ గొప్పదనం ఎక్కువమందికి తెలిసి ఉండకపోవచ్చు. కరోనా పంజా విసురుతున్న వేళ కచ్చితంగా తెలుసుకుని తీరాలి. తిప్పతీగను అమృత, గుడూచి అని కూడా అంటారు.
 
తమలపాకు రూపంలో చిన్నగా ఉండే ఈ ఆకులో విశేషమైన వైద్య గుణాలు ఉన్నాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుత కోవిడ్‌ పరిస్థితుల్లో దీని గురించి తెలుసుకోవాలని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు. తిప్పతీగ ఆకు.. కరోనాకు దివ్యౌషధం అంటున్నారు ఆయుర్వేద డాక్టర్లు.
 
తిప్పతీగ ఆకులను బాగా నూరి గోలీకాయ అంత ఉండలు చేసి 10 రోజుల పాటు ఉదయం, సాయంత్రం తీసుకుంటే రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుందని ఆయుర్వేద వైద్యులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. 
 
ఈ ఔషధాన్ని తీసుకుంటే జ్వరం కూడా రాదని, వచ్చినా త్వరగా తగ్గిపోతుందని అంటున్నారు. ఆయుర్వేద శాఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం తిప్పతీగ ఆకులను 'శంశమినివటి' అనే పేరుతో మందులుగా తయారుచేసి అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వారు వివరిస్తున్నారు.
 
తిప్పతీగ ఆకుల్లోనే కాదు.. కాడల్లోనూ వైద్య గుణాలు ఉన్నాయట. కిడ్నీ సంబంధిత జబ్బులు, మధుమేహంతో పాటు అనేక రకాల అనారోగ్య సమస్యలను తగ్గించేందుకు ఉపయోగించవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఈ తిప్పతీగకు మరణం ఉండదు. వేర్లు తెంచేసినా పైనున్న తీగలు అల్లుకుంటూనే ఉంటాయి. చెట్లు, గోడలు, విద్యుత్‌ తీగలు సహా ఎక్కడైనా పాకుతూ పోతుంటుంది.