పలాసలో స్వచ్చంధంగా స్కూల్స్ మూసివేత
కరోనా వైరస్ వ్యాప్తి శరవేగంగా ఉండటంతో ఈ నెల 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పలాస నియోజకవర్గంలోని అన్ని స్కూళ్లు, కాలేజీలకు తాత్కాలికంగా సెలవులు ప్రకరిస్తున్నటు మంత్రి డాక్టర్ సీదిరి ప్రకటించారు.
పలాస తహసీల్దార్ కార్యాలయంలో ఈ రోజు నియోజకవర్గ పరిధి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు. 1వ తరగతి నుండి 9వ తరగతి వరకు ఇప్పటికే ప్రభుత్వం సెలవులు ప్రకటించిందని 10వ తరగతి నుండి పై తరగతులకు యధావిధిగా తరగతులు నిర్వహణకు నిర్ణయం తీసుకున్నారు.
పలాస నియోజకవర్గ పరిధిలో కోవిడ్ విజృంభన తీవ్ర స్థాయిలో ఉన్న నేపథ్యంలో బావిభారత పౌరులైన విద్యార్థుల ఆరోగ్య భద్రత దృశ్యా, వారి తల్లిదండ్రుల నుండి వచ్చిన వినతులు నిమిత్తం వారం రోజుల పాటు (ఈ నెల 24వ తేదీ నుండి 30వ తేదీ వరకు) సామూహికంగా అన్ని విద్యాసంస్థలు మూసివేయడానికి నిర్ణయం తీసుకున్నారు.
ఈ సెలవుల సమయంలో విద్యార్థులకు టైం టేబుల్ ఏర్పాటు చేసి దానికి అనుకూలంగా వారు ఇళ్లలోనే చదువుకొనే విధంగా చర్యలు తీసుకోవాలని అందరూ ఏకీభవిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఈ కార్యక్రమంలో పలాస తహశీల్దార్, ఏ.యం.సీ చైర్మన్, మున్సిపల్ కమిసనర్, మున్సిపల్ చైర్మన్, పలాస విధ్యాశాఖాధికారి, పోలీస్ ఇన్స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు.