మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 20 ఏప్రియల్ 2021 (18:30 IST)

ఏపీలో కరోనా మహమ్మారి.. గడిచిన 24 గంటల్లో 8,987మందికి పాజిటివ్

ఏపీలో కరోనా మహమ్మారి విరుచుకుపడుతోంది. రోజు రోజుకు పాజిటివ్‌ కేసులతో పాటు మరణాల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇంకా చెప్పాలంటే టెస్టు చేసిన ప్రతి నలుగురిలో ఒకరికి పాజిటివ్‌ వస్తోందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.

రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 8,987 మందికి కరోనా సోకగా వైరస్‌ బారిన పడి 35 మంది తమ ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 9 లక్షల 76 వేల 987కు చేరింది. కరోనా నుంచి 9లక్షల 15వేల 626 మంది బాధితులు కోలుకోగా రాష్ట్రంలో ప్రస్తుతం 53వేల 889 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.
 
తాజాగా నమోదైన మరణాలతో రాష్ట్రంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 7వేల 472 కి పెరిగింది. కరోనా బారిన పడి అత్యధికంగా నెల్లూరులో 8 మంది మృతి చెందగా చిత్తూరులో 5, కడపలో 5, అనంతపురంలో 3, కృష్ణా జిల్లాలో 3, శ్రీకాకుళంలో 3, కర్నూలులో 2, ప్రకాశం జిల్లాలో 2 మరణాలు చోటుచేసుకున్నాయి. అలాగే తూర్పు గోదావరి జిల్లా, గుంటూరు, విశాఖ, విజయనగరంలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు.