1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
  4. Beauty with Raw milk, honey

పచ్చి పాలతో అందానికి మెరుగులు.... ఎలా?

పచ్చిపాల క్లెన్సర్: చర్మం మీద కంటికి కనిపించని దుమ్ము పేరుకుపోతుంది. దాన్ని తొలగించాలంటే క్లెన్సర్‌ను మించిన ఆయుధం మరొకటి లేదు. అయితే అందుకు రసాయనాలతో నిండిన క్లెన్సింగ్ ఉత్పత్తులు వాడడం కంటే కూడా ఎటువంటి హాని కలిగించని పచ్చి పాలు వాడటం బెటర్. ఇవి మం

Beauty
పచ్చిపాల క్లెన్సర్: చర్మం మీద కంటికి కనిపించని దుమ్ము పేరుకుపోతుంది. దాన్ని తొలగించాలంటే క్లెన్సర్‌ను మించిన ఆయుధం మరొకటి లేదు. అయితే అందుకు రసాయనాలతో నిండిన క్లెన్సింగ్ ఉత్పత్తులు వాడడం కంటే కూడా ఎటువంటి హాని కలిగించని పచ్చి పాలు వాడటం బెటర్. ఇవి మంచి క్లెన్సర్‌గా పనిచేస్తాయి. అదెలాగంటే పచ్చిపాలలో దూదిని ముంచి మీ మూఖాన్ని శుభ్రం చేసుకున్నట్లైతే మీ చర్మం తాజాగా ఉంటుంది.

తేనె, నిమ్మరసం చెక్కల ప్యాక్:
నిద్రకు ఉపక్రమించే ముందు మాత్రమే పాటించాల్సిన చిట్కా ఒకటి ఉంది. అదేంటంటే నాలుగైదు చుక్కల పచ్చి తేనెను నిమ్మ చెక్క మీద పోయాలి. ఆ చెక్కతో ముఖ చర్మం మీద సున్నితంగా ఒక నిమిషం పాటు రుద్దాలి. ఐదు నిమిషాలు పాటు ఆలానే ఉంచి ఆ తరువాత ముఖాన్ని చల్లటి నీళ్లతో కడిగేయాలి. ఈ చిట్కాను నిద్రపోయే ముందు ఎందుకు చేయాలంటే నిమ్మ వంటి సిట్రస్ జాతి ఫలాలు కాంతి గ్రాహకాలు, అందుకని పగటి సమయంలో చేయడం వల్ల ఫలితం ఉండదు. చర్మం దెబ్బతినే అవకాశం ఉంది.
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
వాటర్ ఫాస్టింగ్ వద్దే వద్దు బాబోయ్.. గుండెకు చేటు...