బ్యూటీ టిప్స్... పర్‌ఫ్యూమ్ వాసన చాలాసేపు వుండాలంటే వాజిలిన్‌ను?
పర్‌ఫ్యూమ్ వాసన చాలాసేపటి వరకు ఉండాలంటే చేతిమణికట్టు, మెడ మీద కొద్దిగా రాసుకొని దానిపై పర్‌ఫ్యూమ్ వేసుకోవాలి. అలాగే ఒక్కోసారి గోళ్లరంగు సీసా మూత బిగుతుగా పట్టుకు పోయి తీయడానికి రాదు. అలాంటప్పుడు ఆ సీస
పర్‌ఫ్యూమ్ వాసన చాలాసేపటి వరకు ఉండాలంటే చేతిమణికట్టు, మెడ మీద కొద్దిగా రాసుకొని దానిపై పర్‌ఫ్యూమ్ వేసుకోవాలి. అలాగే ఒక్కోసారి గోళ్లరంగు సీసా మూత బిగుతుగా పట్టుకు పోయి తీయడానికి రాదు. అలాంటప్పుడు ఆ సీసా మూతకి కొద్దిగా వాజిలిన్ రాసి మూతపెట్టండి. అలాగే లిప్‌స్టిక్ వేసుకునేటప్పుడు పొరపాటున రంగు పళ్ళకి అంటకుండా ఉండాలంటే పళ్లపై కొద్దిగా దీనిని రాసుకుంటే మంచిది.
అదేవిధంగా కనురెప్పల వెంట్రుకలు పెరగాలంటే రాత్రి పూట పడుకునే ముందు ఐలాషెస్‌కి కొద్దిగా వాజిలిన్ రాసుకొని పడుకుంటే మీ కనురెప్పలు పెరుగుతాయి. షూ మెరవాలంటే వాటిపై పలుచగా వాజిలిన్ రాస్తే సరిపోతుంది. జుట్టుకు కలర్ వేసుకునేటప్పుడు అది చర్మానికి అంటకుండా ఉండాలంటే ముందుగా కొంచెం వాజిలిన్ రాసుకోవాలి.