శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By selvi
Last Updated : శనివారం, 6 జనవరి 2018 (12:00 IST)

శీతాకాలంలో చర్మానికి మేలు చేసే వెన్న...

శీతాకాలంలో చర్మానికి వెన్న ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా పొడి చర్మం వున్నవారికి వెన్న దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఒక టీస్పూన్ వెన్న‌, ఒక టీస్పూన్ మీగ‌డ‌ల‌ను క‌లిపి ముఖానికి రాసి ఐదు నిమిషాల పాటు మ‌సాజ్

శీతాకాలంలో చర్మానికి వెన్న ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా పొడి చర్మం వున్నవారికి వెన్న దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఒక టీస్పూన్ వెన్న‌, ఒక టీస్పూన్ మీగ‌డ‌ల‌ను క‌లిపి ముఖానికి రాసి ఐదు నిమిషాల పాటు మ‌సాజ్ చేసి 20 నిమిషాలు ఆగాక చ‌ల్ల‌ని నీటితో క‌డిగేయాలి. దీంతో చ‌ర్మం మృదువుగా మారుతుంది. ముఖం కాంతివంత‌మ‌వుతుంది. 
 
ఆయిలీ స్కిన్ వున్న వారు ఒక టీస్పూన్ వెన్న‌ను ఒక టీస్పూన్ అర‌టి పండు గుజ్జులో క‌లిపి ముఖానికి రాసి ఆరిన త‌ర్వాత క‌డిగేయాలి. త‌ర‌చూ ఇలా చేస్తే చ‌ర్మం మృదువుగా మారుతుంది. అంతేకాదు ముఖంపై ఉన్న ముడ‌త‌లు కూడా పోతాయి. 
 
అర టీ స్పూన్ వెన్న‌లో రెండు స్పూన్ల ఉడికించిన క్యారెట్ గుజ్జును క‌లిపి ముఖానికి రాసి అర‌గంట అయ్యాక ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. దీంతో చ‌ర్మం కోమలంగా తయారవుతుందని బ్యూటీషియన్లు చెప్తున్నారు.